భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు వరదనీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టులోని 24 గేట్ల ద్వారా వెయ్యి 128 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. రుతుపవనాల ప్రభావంతో ప్రాజెక్ట్ ఎగువన చత్తీస్‌గఢ్ అడవులలో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 74 మీటర్లు కాగా.. ప్రస్తుతం 69.15 మీటర్లు ఉందని అధికారులు తెలిపారు. ప్రాజెక్టుకు మరమ్మతుల నేపథ్యంలో 25 గేట్లను ఎత్తి ఉంచారు. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లో వెయ్యి 128 క్యూసెక్కులు ఉంది. ప్రాజెక్ట్ వద్ద 25 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.


