రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మూడపల్లిలో శ్రీ పద్మావతీ గోదాదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారి కల్యాణం వేద మంత్రోచ్ఛారణల మధ్య వైభవంగా జరిగింది. ఆలయం శాశ్వత చైర్మన్, విశాఖ ఇండస్ట్రీస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జేపీరావు దంపతులు, గ్రామస్తుల ఆధ్వర్యంలో కల్యాణోత్సవం వైభవంగా కొనసాగింది. ఆలయం అర్చకులు దేవాలయ ప్రతిష్ఠ బ్రహ్మోత్సవ కార్యక్రమం నిర్వహించారు. పద్మావతీ గోదాదేవి సమేత శ్రీ వేంకటేశ్వర కల్యాణ మహోత్సవాన్ని రెండు గంటల పాటు నిర్వహించారు. గ్రామస్తులు భారీ సంఖ్యలో ఉత్సవంలో పాల్గొన్నారు. హారతి, మంత్రపుష్పం, భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. ఆలయ కమిటీ సభ్యులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.