తిరుమలలో మఠాల పేరుతో భక్తులను దోపిడీ చేస్తున్నారని తిరుపతి జనసేన ఇన్చార్జ్ కిరణ్ రాయల్ ఆరోపించారు. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. టీటీడీ ఈఓను కలిసి.. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. అభినయ్ రెడ్డి రాజీనామాను ఎందుకు బహిరంగం చేయలేదని ప్రశ్నించారు. వాస్తవాన్ని బయట పెట్టినందుకే మళ్ళీ ఇప్పుడు అభినయ్ వివరణ ఇచ్చార న్నారు. తిరుమలలో అన్ని చోట్లా అవినీతి జరిగిందని చెప్పారు. ఎవరైతే అక్రమంగా దోచుకున్నా వారంద ర్నీ బయటకు తీసుకోస్తామని, తిరుమల నుంచే ప్రక్షాళన మొదలు పెడతామన్నారు.