ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. జులై 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఆయన సర్వీసును పొడిగిస్తూ డీఓపీటీ ఉత్తర్వులు జారీ చేసింది. నీరభ్ కుమార్ ప్రసాద్ ఈ నెల మొదటి వారంలో ఏపీ సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన పదవీకాలం ఈ నెలాఖరులో ముగియనుంది. అయితే, ఏపీ ప్రభుత్వం ఆయన సేవలు కొనసాగించాలని భావించి సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. ముఖ్య మంత్రి చంద్రబాబు అభ్యర్థన మేరకు తాజాగా సీఎస్ పదవీ కాలాన్ని పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.