nayanthara controversy comments: ప్రశాంతంగా ఉన్న ఇండస్ట్రీలో మళ్లీ నయన తార బాంబ్ పేల్చింది. ఆరిపోయిందనుకున్న నిప్పును మళ్లీ కర్రతో కదిపింది. ఇప్పుడు మళ్లీ నయన తార కామెంట్స్ తో కాస్టింగ్ కౌచ్ కాక మొదలైంది.
నయన్ 20 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో అగ్ర కథానాయికగా కొనసాగుతోంది. వయసు పెరిగే కొద్దీ హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలకు షిఫ్ట్ అయ్యింది. అప్పుడప్పుడు హీరోయిన్ గా కూడా కొన్ని సినిమాల్లో నటించింది. తన అందం, నటన, తన ఫిజిక్ వీటన్నింటినీ మెయింటైన్ చేస్తూ 20 ఏళ్లు టాప్ పొజిషన్లో ఉండటం గ్రేట్ అని అందరూ అంటూ ఉంటారు. అలాంటి ఫీట్ సాధించిన నయన తార సినీ, పర్సనల్ లైఫ్ రెండింటిలో వివాదాలకు కొదవ లేదు.
తనకి అందరిలా పెళ్లి చేసుకోవాలని, సంప్రదాయంగా జీవించాలని బలమైన కోరికతో మొదట శింబుని ప్రేమించింది. అతను హ్యాండ్ ఇచ్చాడు. తర్వాత ప్రభుదేవాతో సహజీవనం సాగించింది. అది పెళ్లి వరకు వచ్చి ఆగిపోయింది. దాంతో నయన తార కెరీర్ ఆగిపోయిందని అనుకున్నారు. కానీ లక్కీగా తెలుగులో ఎన్టీఆర్ తో కలిసి నటించిన అదుర్స్ సూపర్ హిట్ కావడంతో తను మళ్లీ ట్రాక్ ఎక్కేసింది. ఆ తర్వాత కుర్ర హీరోల సరసన హీరోయిన్ గా నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఈ క్రమంలో డైరక్టర్ విఘ్నేశ్ శివన్ తో సహజీవనం చేసి, తర్వాత పెళ్లి చేసుకుంది. తర్వాత పిల్లల్ని సరోగసీ పద్ధతిలో కన్నాది.
ఇలా తన కెరీర్ నిండా వివాదాలే. అందుకనే ప్రశాంతంగా ఉండటం ఇష్టం లేక అనుకుంటూ…తన కెరీర్ మొదట్లో ఎదురైన ఒక సంఘటన గుర్తు చేసుకుంది. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీలో నాకు కూడా కాస్టింగ్ కౌచ్ అనుభవం ఎదురైందని చెప్పుకు వచ్చింది. కెరీర్ మొదట్లో ఒక భారీ ప్రాజెక్టులో అవకాశం వచ్చిందని తెలిపారు. అయితే వాళ్లు పెట్టిన కండీషన్ ఏమిటంటే వాళ్లకు నచ్చినట్టు ఉండాలని, వాళ్లు చెప్పింది చేయాలని అన్నట్టు తెలిపారు.
నా టాలెంట్ పై నమ్మకం ఉంది. అందుకే ఆ అవకాశాన్ని సున్నితంగా తిరస్కరించినట్టు తెలిపింది. ప్రస్తుతం ఈ విషయం మళ్లీ ఇండస్ట్రీ అంతటా వేడిపుట్టిస్తోంది. మరికొంత మంది సీనియర్ హీరోయిన్లు కూడా తమకి ఎదురైన అనుభవాలు చెబుతారని అంటున్నారు. కొంతమంది విమర్శిస్తున్నారు కూడా… మరి అప్పుడంతా గొడవ జరిగినప్పుడు…‘నువ్వెందుకు నోరు మెదపలేదు’ అని కూడా దుయ్యబడుతున్నారు.
కెరీర్ చివర్లో ఇక తనకి అవకాశాలు రావని ఫిక్స్ అయ్యాక ఇలాంటివన్నీ చెబుతోందని కూడా విమర్శిస్తున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే నయనతార నటించిన సినిమా ‘కనెక్ట్’ గత ఏడాది విడుదలై విజయం సాధించింది. ప్రస్తుతం షారూఖ్ ఖాన్ సినిమా ‘జవాన్’లో నటిస్తోంది. రాజు-రాణిలాంటి బ్లాక్ బ్లస్టర్ ఇచ్చిన అట్లీ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు.