21.3 C
Hyderabad
Tuesday, July 1, 2025
spot_img

విభజన హామీల సాధనలో చంద్రబాబు సక్సెస్ అయ్యేనా?

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి దిశగా కీలక అడుగులు పడబోతున్నాయా ? అమరావతి, పోలవరం నిర్మాణాలను అత్యంత ప్రాధాన్యతా అంశాలుగా చూస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు అందరిలోనూ ఇవే అంచనాలు. పైగా కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులోనూ ప్రధాన భాగస్వామిగా టీడీపీ ఉన్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో విభజన హామీల విషయంలో ఏపీ సీఎం ఎలా వ్యవహరిస్తారు
అన్నది ఉత్కంఠ రేపుతోంది.

ఇప్పటివరకు ఒక లెక్క ఇప్పటి నుంచి మరో లెక్క అన్నట్లుగా మొన్నటి ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి. సొంతం గానే మేజిక్ ఫిగర్ సాధిస్తామని, కూటమిగా నాలుగు వందల స్థానాలు సాధిస్తామన్న బీజేపీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు నానా తిప్పలు పడాల్సిన పరిస్థితి వచ్చింది. చివరకు బొటాబొటి మార్కులతో కేంద్ర ప్రభుత్వం కొలువు తీరింది. అయితే ప్రభుత్వ ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించాయి టీడీపీ, జేడీయూలు. ఆ రకంగా చూస్తే ఏపీకి మంచి రోజులు వచ్చినట్లేనన్న భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది. నిజానికి 2019 ఎన్నికల్లో వైసీపీ బంపర్ మెజార్టీ సాధించింది. 22 పార్లమెంటు స్థానాలతో జగన్‌ సంచలనం సృష్టించారు. కానీ, నాటి ఎన్నికల్లో కేంద్రంలో మరోసారి ఎన్డీయే అధికారంలోకి వచ్చింది. పైగా బీజేపీ సొంతంగా మేజిక్ ఫిగర్ సాధించడంతో విభజన హామీలును ఒత్తిడి చేసి అమలు చేయించుకునే అవకాశం తప్పిపోయింది. కానీ, ఇప్పుడలా కాదు. కేంద్రంలో బీజేపీకి సొంతంగా ప్రభుత్వా న్ని ఏర్పాటు చేసే మెజార్టీ రాలేదు. భాగస్వామ్య పక్షాలు కీలకంగా మారాయి. దీంతో ఇవన్నీ గమనించే ఇప్పటికే ప్రధాని నరేంద్రమోడీ సైతం భాగస్వామ్యపక్షాలకు సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

సరిగ్గా ఈ పరిస్థితే ఏపీకి వరంలా మారిందని అంటున్నారు రాజకీయ నేతలు, విశ్లేషకులు, మేధావులు. మేము ఎన్డీయేకు మద్దతిస్తాం. మీరు ఏపీ అభివృద్ధి కోసం చేయాల్సిన పనులు చేసిపెట్టండి అని చంద్రబాబు అడిగితే తప్పనిసరిగా చేయాల్సిన పరిస్థితుల్లో మోడీ ఉన్నారని అంటున్నారు. దీంతో ఏపీలో విభజన హామీలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో అభివృద్ధి కార్యక్రమాల అమలుపై ప్రజలంతా గంపెడాశలు పెట్టుకున్నారు. అయితే ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించిన విభజన హామీలను గత పదేళ్లుగా బీజేపీ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదన్న విమర్శ ఉంది. ఇలాంటి వేళ రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదాపై టీడీపీ అధినేత చంద్రబాబు ఎలాంటి వైఖరి అవలంభిస్తారన్నది ఆసక్తి రేపుతోంది. ప్రత్యేక హోదా ద్వారా పెద్ద ఎత్తున పన్నుల ప్రయోజనాలు దక్కుతాయి. తద్వారా ఎక్కువ సంఖ్యలో కంపెనీలు వచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అదే సమయంలో ఏపీ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినట్లుగా 20 లక్షల ఉద్యోగాల కల్పన కూడా సులువవుతుంది.

     ఇక ఏపీకి జీవనాడి లాంటి పోలవరం నిర్మాణం కూడా విభజన హామీల్లో ఒకటి. ఇప్పటికే ప్రాజెక్టు నిర్మాణం చాలావరకు పూర్తైనా, ఇంకా పరిహారం విషయంలో పరిస్థితి ఏమంత సానుకూలంగా లేదు. అలాగే నిర్మాణం విషయంలోనూ ఓ 20 నుంచి 30 శాతం పనులు పెండింగ్‌లో ఉన్నట్లుగా చెబుతు న్నారు. ఇలాంటి వేళ కేంద్రం నుంచి తగినంత సహాయ సహకారాలు లభిస్తే ఏపీకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద మేలు చేసినట్లవుతుంది. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం చేస్తామని గతం లోనే కేంద్రం ప్రకటించింది. ఇప్పుడు చంద్రబాబు కీలక పాత్ర పోషించనున్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర ప్రజల పాలిట కల్పవృక్షంలా ఉన్న స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటు పరం కాకుండా అడ్డుకోవాల్సి ఉంది. మరిఈ విషయంలో తెలుగు దేశం అధినేత ఎలాంటి అడుగు వేస్తారన్న దానిపై రాజకీయ వర్గాల్లోనే కాదు. సామాన్య ప్రజానీకంలోనూ చర్చ సాగుతోంది. అన్నింటికంటే ముఖ్యంగా ప్రజల కలల రాజధాని అమరా వతి నిర్మాణం. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మూడు రాజధానుల ప్రతిపాదనతో అమరావతి ప్రాధాన్యం తగ్గిపోయింది.నిర్మాణాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. ఇప్పుడు టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో ఇక్కడి ప్రజల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. పైగా చంద్రబాబు కూడా రాజధానిగా అమరావతికే కట్టుబడి ఉన్నామని ప్రకటించడంతో మళ్లీ మునుపటి వెలుగులు ఖాయమని ఇక్కడి వారు బలంగా నమ్ముతున్నారు. అయితే కేంద్రం నుంచి నిధులు భారీగా మంజూరు చేయించు కుంటే ఇప్పటి వరకు పడకేసిన రాజధాని నిర్మాణం శరవేగంగా పూర్తవుతుంది. తద్వారా ఇప్పటివరకు రాజధాని లేని రాష్ట్రంగా పేరుతెచ్చుకున్న ఏపీకి కలల రాజధాని సొంతమవుతుంది. అటు ఏపీ సీఎం చంద్రబాబు సైతం అమ రావతి, పోలవరం తమకు ప్రాధాన్యతా అంశాలని పేర్కొనడంతో ప్రభుత్వం ఏ విధంగా రాబోయే రోజుల్లో ముందుకెళ్లబోతోందన్న క్లారిటీ ఇచ్చినట్లైంది.

   కేవలం ఇవే కాదు రాష్ట్ర, జిల్లా, గ్రామీణ రహదారుల అభివృద్ధి, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన సహా ఇతర ప్రాజెక్టుల కోసం కేంద్రంతో సఖ్యతగా మెలుగుతూ సాధ్యమైనంత ఎక్కువగా నిధులు మంజూరు చేయించుకుంటే త్వరితగతిన రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందన్న మాట విన్పి స్తోంది. అటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా చూసినా ప్రస్తుతం టీడీపీ కూటమి ఇచ్చిన హామీల అమలు అంత తేలికగా సాగేది కాదన్న మాట విన్పిస్తోంది. దీంతో కేంద్రంలో మోడీ ప్రభుత్వం సాఫీగా సాగేందుకు మద్దతుగా నిలుస్తూనే రాష్ట్ర ప్రయోజనాలను చంద్రబాబు నాయుడు పరిరక్షించాలని అంతా కోరుతున్నా రు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్