హైదరాబాద్‌లో సంచలన సంఘటన వెలుగుచూసింది. డబ్బు, ఉద్యోగాలు ఆశ చూపి కొందరు వ్యక్తులు అమ్మాయిల జీవితాలో ఆటలాడుతున్నారు. వారి ఆర్థిక పరిస్థితిని ఆసరాగా చేసుకుని వ్యభిచారంలోకి దింపి సొమ్ము చేసుకుంటున్నారు. పోలీసుల రంగ ప్రవేశంతో ఈ వ్యవహారం బయటపడింది. టాస్క్ ఫోర్స్ డీసీపీ సాధన రష్మీ పెరుమాళ్ కేసుకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
హైదరాబాద్‌లో వ్యభిచారం దందా నడుపుతున్న అయిదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉద్యోగ రీత్యా నగరానికి వస్తున్న యువతులనే టార్గెట్ చేసి వ్యభిచార ఊబిలోకి దింపుతున్నారు. హైదరాబాద్‌లో హైటెక్ విధానంలో వ్యభిచార దందా చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నలుగురు నిర్వాహకులు, ఒక విటుడిని అరెస్టు చేశారు. ఆరుగురు యువతులను రక్షించారు. అయితే వ్యభిచార గృహం నిర్వాహకురాలిపై గతంలో 16 కేసులు ఉన్నట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి టాస్క్ ఫోర్స్ డీసీపీ సాధన రష్మీ పెరుమాళ్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
విజయవాడకు చెందిన సూర్యకుమారి ఈ వ్యభిచార ముఠాకు లీడర్ అని డీసీపీ చెప్పారు. ఆమె పది మారు పేర్లతో చలామణి అవుతూ నగరంలోని మధురానగర్‌లో నివసిస్తోంది. తిరుపతికి చెందిన విజయ శేఖర్ రెడ్డి అక్కడే ఉండేవాడు. వీరుద్దరూ కలిసి నగరంలో వ్యభిచార గృహాలు నిర్వహించేవారు. 2020 లో పీడీ యాక్టు కింద జైలుకు పంపినా తీరు మారలేదని చెప్పారు.ఏపీ, పశ్చిమబెంగాల్, త్రిపుర తదితర రాష్ట్రాల తదితర రాష్ట్రాలకు చెందిన యువతులకు డబ్బు, ఉద్యోగాల ఆశ చూపి నగరానికి తీసుకొచ్చే వారని తెలిపారు. అనంతరం వారిని వ్యభిచార రొంపిలోకి దింపి సొమ్ము చేసుకునేవారన్నారు. శేఖర్‌రెడ్డి కస్టమర్లకు డేటాను ఒక యాప్‌లో ఉంచగా, వారికి కావాల్సిన యువతిని బుక్ చేసుకుంటారని చెప్పారు. యాప్ ఆధారంగా కస్టమర్లు చెప్పిన ప్రాంతాలు, హోటళ్లకు యువతులను తీసుకెళ్తారని వెల్లడించారు. సూర్యకుమారి కస్టమర్ల నుంచి క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా డబ్బు తీసుకుంటోందని వివరించారు.
గురువారం పంజాగుట్ట ఠాణా పరిధిలోని పార్క్ హోటల్లో పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోదా చేశారు. గండిపేటకు చెందిక కిలారు కీర్తితేజ, ఓ యువతి పట్టుబడ్డారు. వారిద్దరి దగ్గర నుంచి ముఠాకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. వేర్వేరు ప్రాంతాల్లో తనిఖీ చేసి సూర్యకుమారి, శేఖర్‌రెడ్డి, వారికి సహకరిస్తున్న పశ్చిమ బెంగాల్ వాసి అర్కోజిత్ ముఖర్జీ, తిరుపతికి చెందిన వేణుగోపాల్ బాలాజీని అదుపులోకి తీసుకొని పంజాగుట్ట పోలీసులకు అప్పగించామన్నారు.ఇటీవల ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. డబ్బులకు ఆశపడి నిరుద్యోగ యువతులు, మైనర్లను వ్యభిచార ఊబిలోకి దింపి దందా నడిపిస్తున్నారు కొందరు వ్యక్తులు.ఈ మధ్య కాలంలో జగిత్యాల శివారు చల్గల్కు చెందిన కొందరు ముఠా సభ్యులు, పాఠశాలలో చదువుకునే మగ పిల్లల ద్వారా మత్తు పదార్థాలు స్కూళ్లోకి చేరవేసి ఆడ పిల్లలకు వాటిని అలవాటు చేస్తున్నారు.మత్తు పదార్థాలకు బానిసలైన జగిత్యాల పట్టణానికి చెందిన బాలికలను ఇటీవల హైదరాబాద్‌లోని ఓ రేవ్ పార్టీకి కూడా తీసుకెళ్లినట్లు వెలుగులోకి వచ్చింది.


