సీఎం తాలూకా మాది కుప్పం మాట తప్పం అంటూ చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అమరావతికి తెలుగు తమ్ముళ్లు బయలుదేరి వెళ్లారు. కుప్పం ఎమ్మెల్యే, టీడీపీ అధినేత చంద్రబాబు 4వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్నారు. ప్రమాణస్వీకార ఉత్సవానికి కుప్పం తిరుపతి గంగమ్మ దేవస్థానంలో పూజలు నిర్వహించి, అమరావతికి టీడీపీ శ్రేణులు తరలి వెళ్లారు. కార్లపై సీఎం తాలుకా… మాది కుప్పం.. మాట తప్పం.. అనే స్టిక్కర్లు అతికించుకుని చంద్రబాబుపై తమ అభిమానాన్ని వారు చాటుకున్నారు.


