ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమికి జగన్ ఒక్కడే కారకుడు కాదని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి, మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు అన్నారు. వైసీపీ ఓటమికి ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేల వైఖరి అసభ్యకరంగా ఉండడం కూడా ఒక కారణమని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం చేపడుతున్న పథకాలలో ఉన్న లోపాలను గ్రౌండ్ రియాలిటీలను జగన్ తెలుసుకోలేని అన్నారు. వైసిపి ప్రభుత్వం సంక్షేమ పట్ల అధిక ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ అభివృద్ధి విషయంలో వెనుకబడిందన్నారు మల్లాడి కృష్ణారావు.