ఆహార భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు. అందరికీ ఆహార భద్రత కల్పన ప్రభుత్వ లక్ష్యం అని చెప్పారు. హోటల్ తాజ్‌కృష్ణలో గ్లోబల్ రైస్ సమ్మిట్ సదస్సులో మంత్రి ఉత్తమ్‌తో కలిసి తుమ్మల పాల్గొన్నారు. ధాన్యం ఉత్పత్తిలో రాష్ట్రం అగ్రగామిగా ఉందని మంత్రులు ఉత్తమ్, తుమ్మల అన్నారు. రాష్ట్రంలో క్రమంగా వరి ఉత్పత్తి పెరుగు తోందని చెప్పారు.