ఏపీ ఎన్నికల ఫలితాలు తనను ఆశ్చర్యానికి గురి చేశాయని వైసీపీ అధినేత జగన్ అన్నారు. మంచి చేసినా ఓటమి పాలయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. మేనిఫెస్టోలో ఇచ్చిన 99 హామీలను నెరవేర్చామని చెప్పారు. ఎన్ని మంచి పనులు చేసినా రైతులు, అక్కచెల్లెమ్మల అప్యాయతలు ఏమయ్యాయో తెలియ డం లేదన్నారు. అమ్మ ఒడి అందుకున్న తల్లులకు తాను మంచే చేశానని చెప్పారు. ప్రజలకు మంచి చేసినా ఓటమి పాలయ్యామని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.


