వేములవాడ ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేకువజాము నుండే తలనీలాలు సమర్పించి, ధర్మ గుండంలో పుణ్య స్నానాలు ఆచరించి కోడె మొక్కు చెల్లిస్తున్నారు. విద్యార్థులకు సెలవులు ముగుస్తుం డడంతో భక్తులు రద్దీ అనూహ్యం గా పెరిగింది. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో కోడెల క్యూలైన్లు పూర్తిగా నిండిపోయాయి. దీంతో స్వామివారి దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. భక్తుల రాకతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. వాహనాలతో పార్కింగ్ స్థలం పూర్తిగా నిండిపోయింది. రాజన్నను దర్శించుకున్న భక్తులు అనుబంధ ఆలయాలను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాటు చేశారు.


