తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ ఏర్పాట్లను మేయర్ గద్వాల విజయలక్ష్మి, అంబర్‌పేట కాంగ్రెస్ ఇంచార్జి రోహిణీ రెడ్డి పరిశీలించారు. పరేడ్ గ్రౌండ్స్‌ను సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. సభా ప్రాంగణంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా కార్యక్రమం సజావుగా సాగేందుకు అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పనిచేయాలని సూచనలు చేశారు. స్టేజ్ ఏర్పాట్లు, మైక్ సిస్టం, ఎల్‌ఈడీ స్క్రీన్ ల ఏర్పాట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పార్కింగ్ ఏర్పాట్లు, వీఐపీ రాకపోకలకు అంతరాయం కలగకుండా చేపట్టబోయే చర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.


