ఐపీఎల్ 2024 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ మరో కీలక మ్యాచ్ కు రెడీ అయ్యింది.చెన్నై చిదంబరం స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ తో SRH తలపడనుంది.ఈ మ్యాచ్ లో గెలిచిన టీమ్ ఫైనల్స్ లో KKR తో ఆడనుంది. క్వాలిఫైయర్ వన్ లో కేకేఆర్ చేతిలో ఓడిన SRH కు ఫైనల్స్ కు చేరేందుకు ఈరోజు మరో అవకాశం దక్కింది. దీంతో ఈరోజు జరిగే మ్యాచ్ లో గెలిచి ఫైనల్స్ కు వెళ్లాలని SRH ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఎలిమినెటర్ మ్యాచ్ లో RCBను ఓడించిన రాయల్స్ ఈ సాయంత్రం జరిగే మ్యాచ్ గెలుస్తామన్న కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. చెన్నై చిదంబరం స్టేడియం స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. దీంతో రాయల్స్ స్పిన్నర్లు అశ్విన్ , చాహల్ ను ఎదుర్కోవడం SRH ఓపెనర్లకు చాలేజింగ్ అని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. దీనికి తోడు చెన్నై చిదంబరం స్టేడియం సన్ రైజర్స్ కి కలిసిరాలేదు.ఇక్కడ ఆడిన 10 మ్యాచుల్లో కేవలం ఒక్క మ్యాచ్ లోనే రైజర్స్ విజయం సాధించారు. SRH ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ తో పాటు రాహుల్ త్రిపాఠి , నితీష్ రాణిస్తే సన్ రైజర్స్ గెలిచే ఛాన్స్ ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు.


