నటి హేమ ఆడిన డ్రామాలు అన్నీ ఇన్నీ కావు. తాను బెంగళూరు రేవ్ పార్టీలో లేనని నిరూపించు కునేందుకు నానా ప్రయత్నాలు చేసింది. బెంగళూరు రేవ్ పార్టీ విషయం మీడియాలో రాగానే, వెంటనే ఓ వీడియో రిలీజ్ చేసింది. తాను హైదరాబాద్‌లోనే ఉన్నానని, మీడియాలో వస్తున్న వార్తలు నమ్మొద్దని చెప్పింది. బెంగళూరు రేవ్ పార్టీలో పట్టుబడినట్లు వస్తున్న వార్తలు అబద్ధమని ఖండించింది. కావాలంటే తనకు వీడియో కాల్ చేసుకోవాలని అన్నారు.హేమ వీడియో రిలీజ్ చేసిన కొద్ది సమయం తర్వాత బెంగళూరు పోలీసులు ప్రెస్ మీట్ పెట్టారు. రేవ్ పార్టీలో దొరికిన నటి ఫోటో అంటూ హేమ ఫోటో విడుదల చేశారు. అయితే ఆమె పేరును అసలు పేరు కృష్ణవేణితో బెంగళూరు రేవ్ పార్టీకి హాజరైనట్టు తెలుస్తోంది. ఆ తర్వాత కిచెన్‌లో బిర్యానీ చేస్తున్న వీడియోను విడుదల చేసింది హేమ. మొత్తానికి తాను బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొనలేదని జనాన్ని నమ్మించేందుకు పడరాని పాట్లు పడింది. కానీ చివరకు డ్రగ్స్ టెస్టుల్లో అడ్డంగా బుక్కైంది. హేమ బ్లడ్ శాంపిల్స్‌లో డ్రగ్స్ ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు.