జగిత్యాల జిల్లా రామోజీపేట గ్రామంలో రైతులు ఆందోళన చేపట్టారు. వరి ధాన్యం కొనుగోలు చేయాలం టూ రోడ్డుపై బైఠాయించి రైతులు నిరసనకు దిగారు. ఐకేపీ సెంటర్‌కు వరిధాన్యాన్ని తీసుకొచ్చి నెల రోజులు గడుస్తున్నా , కొనుగోలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మిల్లర్లు, లారీ ఓనర్లు కుమ్మక్కై తమను నట్టేట ముంచుతున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. వర్షాలు కురుస్తుండడంతో వడ్లు తడిసి మొలకలు వచ్చే అవకాశం ఉందని, వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.