తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ పేరును TGSRTCగా మారిన నేపథ్యంలో సంస్థకు చెందిన ఓ లోగో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అయితే TGSRTCపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ ఖండించారు. TGSRTC కొత్త లోగో ఇదే నంటూ ఇంటర్నెట్‌లో ఒకటి వైరల్ అవుతోంది. అయితే ఆ ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని సజ్జనార్ స్పష్టత ఇచ్చారు. అధికారికంగా ఇప్పటివరకు కొత్త లోగోను సంస్థ విడుదల చేయలేదని తెలిపారు. టీజీఎస్ఆర్టీసీ కొత్త లోగో అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లోగో ఫేక్ అని స్పష్టం చేశారు. ఆ లోగోతో సంస్థకు ఎలాంటి సంబంధం లేదన్న ఆర్టీసీ ఎండీ… కొత్త లోగోను సంస్థ రూపొందిస్తోందని చెప్పారు.