25.2 C
Hyderabad
Monday, January 26, 2026
spot_img

తగ్గిన మామిడి దిగుబడి ….. మండుతున్న ధరలు

   వేసవి వస్తోంది అంటే, మామిడి సీజన్ వస్తోందన్నమాటే, ఉగాది నాడు మామిడి లేనిదే కొత్త సంవత్సరం ప్రారంభం కాదు. ఆంధ్రా ఫేమస్ ఆవకాయలు పెట్టేవారి నుంచి మామిడి పండ్లు రుచి చూపే వారంతా మామిడి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తారు. వేసవి వచ్చిందంటే పండ్లలో రారాజైన మామిడిని రుచి చూడని వారు ఉండరు. కానీ, మామిడి రైతులకు ఈ ఏడాది కన్నీళ్లే మిగులుతున్నాయి. ఏళ్ల తరబడి తోటలను సాగు చేస్తున్నా, మామిడి పంట దిగుబడి రావడం లేదు. వాతావరణంలో మార్పుల ప్రభావంతో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. కొన్ని చోట్ల ఎండ వేడిమికి మామిడి కాయలు రాలిపోగా, మరికొన్ని చోట్ల మామిడి చెట్లకు చీడలు, తెగుళ్లు వచ్చి కాయలు రాలి పోయా యి. దిగుబడి తగ్గడంతో అరకొర మామిడికాయలు మార్కెట్లో దర్శనమిస్తే, ధరలు కొండెక్కి కూర్చున్నాయి. సామాన్య, మధ్యతరగతి ప్రజలు మామిడి కాయలను కొనాలంటే జంకు తున్నారు. మామిడి కిలో రూ.80 నుంచి 180 వరకు మార్కెట్లో విక్రయిస్తున్నారు.

  అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా మామిడి తోటల సాగు ఎక్కువ. మామిడి సాగు చేస్తున్నా గిట్టుబాటు ధరలు లేక నాలుగు ఏళ్లుగా తీవ్రంగా నష్టపోతున్నారు. గతేడాది కంటే ఈ ఏడాది ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల నష్టపోయారు. ఇక్కడ నుండి ముంబై, చెన్నై, హైదరాబాద్, ఇతర ప్రాంతాలకు మామిడికాయలను ఎగుమతి చేస్తారు. గతంలో మామి డి పూతను చూసి వ్యాపారస్తులు పంటను కొనేవారు. ప్రస్తుతం మామిడికాయలను చూసి వ్యాపారస్తులు కొనుగోలు చేస్తున్నారు. గతంలో మాదిరిగా వ్యాపారస్తులు ఉత్సాహం చూపడం లేదు. ఈ ఏడాది అనుకున్నంత పంట రాకపోవ డంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

  అన్నమయ్య జిల్లావ్యాప్తంగా 35,863 హెక్టార్లలో మామిడి పంట రైతులు సాగు చేశారు .ఇందులో రైల్వే కోడూర్ 3,687, టీ. సుండుపల్లె 3,036, చిన్నమండెం 2,500, లక్కిరెడ్డిపల్లి 2,400, వీరబల్లి 2,105 కేవీ పల్లి 1,850, చిట్వేల్ 1,760, గుర్రంకొండ 1,658, రామాపురం 1,433, పీలేరు 1,400, కలకడ 1,378, పెనగలూరు 1,352, సంబేపల్లి 1,230, వాయల్పాడు 1,50, కలికిరి 1,090, గాలివీడు 9020, రాయచోటి 890, నిమ్మనపల్లి 820, పెద్దమండెం 784, నందలూరు 712, ఓబులవారిపల్లి 650, రామసముద్రం 600, మదనపల్లి 690, రాజంపేట 374,కు రబలకోట 300, తంబళ్లపల్లె 300, బి .కొత్తకోట 286, మొలకల చెరువు 250, పిటిఎం 217, పుల్లంపేట 196 హెక్టార్ల లో మామిడి పంటను రైతులు సాగు చేశారు.మామిడి ధరలు ఎండలతో సమానంగా మండిపోతున్నాయి. మార్కెట్లో అంతగా మామిడి పండ్లు కనిపించడం లేదు. ఒకవేళ కనిపించినా చాలా తక్కువ మోతాదులో మామిడి కాయలు ఉంటున్నాయి. మార్చి చివరి వారం నుంచి మే వరకు మార్కెట్ మొత్తం మామిడి పండ్లే దర్శనమిస్తాయి. ఈసారి దిగుబడి తగ్గడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని వ్యాపారులు అంటున్నారు. పూత రాకపోవడం వచ్చినా రాలిపోవడంతో దిగుబడిపై ప్రభావం పడింది. గతంలో శీతాకాలంలో మామిడి చెట్లకు దట్టంగా పూత వచ్చినా, వాతావర ణంలో మార్పులు కారణంగా నిలబడక పోవడం, నాసిరకమైన మందులు ప్రభావంతో పూత నిలబడ లేదని రైతులు వాపోతున్నారు. దీనికి కారణంగానే మార్కెట్లో మామిడి పండ్లు కనిపించడం లేదు. అరకొరగా కనిపించినా ఆ పండ్లు కూడా కిలో 80 నుంచి 180 వరకు మార్కెట్ లో అమ్ముతున్నారు.

జిల్లాలో మామిడి కాయలను విక్రయించేందుకు పలు మండీలు ఉన్నాయి. రైతులు, వ్యాపారస్తులు మామిడి కాయలను ఈ మండీలకు చేరవేసి అమ్ముకుంటారు. ప్రస్తుతం మామిడి దిగుబడి తగ్గడంతో మండీలకు మామిడికాయలు రావడంలేదు. మండీలు వెలవెల పోతున్నాయి. ప్రతి నియోజకవర్గంలో కొంతమంది వ్యాపారులు మామిడి షెడ్లను ఏర్పాటు చేశారు. ఆయా మండలాలలోని రైతులు ఆ మామిడి షెడ్లకు మామిడి కాయలను తరలించి విక్రయిస్తుం టారు. ప్రస్తుతం ఆ షెడ్లకు కూడా కాయలు రాకపోవడంతో అవి కూడా వెలవెల పోతున్నాయి.

    వీరబల్లి బెనిషా భలే రుచి ప్రతి ఒక్కరికి వీరబల్లి బేనీషా అంటే మహా ఇష్టం. ఈ బేనీషాను కొనుగోలు చేయడానికి ఢిల్లీ, ముంబై, కలకత్తా ప్రాంతాల నుంచి వ్యాపారస్తులు వస్తారు. వీరబల్లి బెనిషాను విదేశాలకు కూడా ఎగుమతి చేస్తుంటారు. అందుకే బేనీషా కు అంత పేరు వచ్చింది. వీరబల్లి మండలం లో మామిడి తోటలో అధికంగా ఉన్నాయి. మామిడి సాగులో రైతులకు అధికష్టాలు వస్తున్నాయి. మామిడి పంటలు తోటలో దుక్కులు, పాదులు తీయడం, కంచే, చెట్లకు ఎరువులు, మందులు, నీరు కట్టడం వంటివి చాలా అవసరం. ఇంత కష్టపడినా నాలుగు ఏళ్లుగా మామిడి పంట సరిగ్గా రావడం లేదు పెట్టు బడి ఎక్కువ ఆదాయం తక్కువ. ప్రభుత్వాలు ఆదుకోండి రైతులకు న్యాయం చేయాలి. మామిడి చెట్లు ఉన్న ప్రతి రైతుకు ప్రభుత్వాలు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి. అలాగే నష్టపరిహారం కూడా అందించాలి.  ఏడాది వాతావరణం మార్పిడి కారణంగా మామిడి పూత లేటుగా, తక్కువగా పూసింది. ఖరీఫ్ మొదటలో జూన్ మాసం లో మామిడి చెట్లకత్తిరింపులు, దున్నకాలు చెట్లకు పాదులు వంటివి చేసుకోవాలి.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్