30.2 C
Hyderabad
Thursday, May 7, 2026
spot_img

ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో గెలుపు ఎవరిని వరించునో ?

     పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఓట్ల వేటను సాగిస్తున్నాయి ప్రధాన పార్టీలు. ఎలాగైనా గెలవాలన్న కసితో ఉన్న బీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌లు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. మరి త్వరలో జరిగే ఈ ఎన్నికల్లో గెలుపు ఎవరిది..? అందుకోసం పార్టీల వ్యూహాలేంటి..?

     పార్లమెంట్ ఎన్నికలు అలా ముగిసాయో లేదో ఇలా గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలైంది. ఈ నెల 27వ తేదీన నల్గొండ, ఖమ్మం, వరంగల్‌ పట్టభద్రుల శాసనమండలి స్థానానికి పోలింగ్‌ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమవడంతో పార్టీలన్నీ ప్రచార హోరును పెంచాయి. అయితే, ఈ నియోజకవర్గ ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్‌రెడ్డి జనగామ ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది. దీంతో ఎలాగైనా ఈ స్థానాన్ని కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాయి ప్రధాన పార్టీలు. అందుకు తగ్గట్టుగా వ్యూహాలు రచిస్తూ ముందుకు సాగుతున్నా యి. ఈ నేపథ్యంలోనే గత ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్‌రెడ్డికి గట్టిపోటీ ఇచ్చిన చింతపండు నవీన్‌ అలియాస్‌ తీన్మార్‌ మల్లన్నను ఈసారి బరిలో దించింది కాంగ్రెస్‌. ఎలాగైనా విజయం సాధించి అందివచ్చిన అవకాశాన్ని చేజిక్కించు కోవా లన్న తపనలో ఉండగా  గతసారి నాలుగో స్ధానానికి పరిమితమైన బీజేపీ కూడా ఈసారి గెలుపు ఆశలు పెంచుకుంది. అందుకు తగ్గట్టుగా పావులు కదుపుతోంది.

   ఇక ఈ నియోజకవర్గం పరిధిలో మొత్తం 12 జిల్లాలు ఉన్నాయి. అవి సిద్దిపేట, జనగాం, హన్మకొండ, వరంగల్‌, మహబూబాబాద్‌, ములుగు, జైశంకర్‌ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, యాదాద్రి భువనగిరి, సూర్యపేట, నల్గొండ జిల్లాలన్నీ కూడా ఈ నియోజకవర్గం పరిధిలోనివే. ఇక్కడ మొత్తం 4 లక్షల, 63 వేల, 389 మంది గ్రాడ్యుయేట్‌ ఓటర్లు ఉండగా వీరిలో అత్యధికంగా ఖమ్మంలో 83 వేల 879 మంది ఓటర్లు, అతి తక్కువగా సిద్దిపేట జిల్లాలో 4 వేల 679 మంది ఉన్నారు. ఇక ఈ ఎన్నికల్లో భారీ సంఖ్యలో 52 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అయితే, బ్యాలెట్‌ పేపర్‌పై ఎలాంటి సింబల్స్‌ లేకుండా, పార్టీ, అభ్యర్థి పేర్లతో మాత్రమే ఈ వెల్లడికి రెండు, మూడు రోజులు పట్టే అవకాశం ఉంటుంది.

   ఇక పోలింగ్‌ తేదీ దగ్గరపడుతుండటంతో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అయితే, ఎంపీ ఎన్నికలకు ముందు నుంచే కాంగ్రెస్‌ అభ్యర్ధి తీన్మార్‌ మల్లన్న తనదైన శైలిలో ప్రచారం చేపట్టారు. మల్లన్న తరుపున ఆయా జిల్లాల మంత్రులు ప్రచారం నిర్వహిస్తున్నారు. మరోపక్క బీఆర్‌ఎస్‌ కూడా ప్రచారాన్ని సాగిస్తుండగా ఆ పార్టీ అభ్యర్ధి కోసం కేటీఆర్‌, ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ చెమటోడు స్తున్నారు. ఈ సందర్భంగా ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోస్తున్నారు. నిరుద్యోగులను, ఉద్యోగులను బీఆర్‌ఎస్‌ వంచించిందని కాంగ్రెస్‌ విమర్శిస్తోంటే హస్తం ఆరు నెలల పాలనలో చేసిందేమీ లేదంటూ గులాబీ నేతలు విరుచుకుపడుతున్నారు. నోటిఫికేషన్లు, పేపర్‌ లీకేజీలు, ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి అంశాలను కాంగ్రెస్‌ లేవనెత్తుతుంటే, బీఆర్‌ఎస్‌ కూడా ఇదే అంశాలతో కాంగ్రెస్‌ను నిలదీస్తోంది. ఈ ఆరు నెలల్లో ఒక్క నోటిఫికేషన్‌ ఇవ్వలేదని, ఒక్క ఉద్యోగాన్ని భర్తీ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అలాగే తీన్మార్‌ మల్లన్న వ్యక్తిగత జీవితంలో లోపాలను ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పి స్తోంది. ఇదే క్రమంలో ప్రజా సేవ కోసం రైతు కుటుంబం నుంచి వచ్చిన రాకేష్‌రెడ్డి ఐటీ ఉద్యోగాన్ని వదిలి అమెరికా నుంచి వచ్చారని ప్రశంసల జల్లు కురిపిస్తోంది. మరి పోటీపోటీగా సాగుతున్న ఈ ప్రచారంలో ఎవరి మంత్రం పని చేస్తుంది.? ఓటర్లు ఎవరి మాటలను చెవికెక్కించుకుంటారు..? ఏ పార్టీకి మద్దతుగా నిలుస్తారన్నది ప్రస్తుతం ఆసక్తికర అంశంగా మారింది. ఇవన్నీ తేలాలంటే పట్టభద్రుల ఎన్నికలు పూర్తయి ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.

Latest Articles

పవన్ కళ్యాణ్‌ ఎక్కడ తప్పు చేశారు? .. ఎందుకు ముఖ్యమంత్రి కాలేకపోయారు?

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త పార్టీ పెట్టిన సినీ హీరో విజయ్ ఏకంగా ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకునే స్థాయికి చేరడం జాతీయ రాజకీయాల్లో పెద్ద సంచలనం. సరిగ్గా ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్