జనసేన నేత నాగబాబు మళ్లీ ట్వీట్టర్‌లో యాక్టివ్ అయ్యారు. గతంలో అల్లు అర్జున్ ను ఉద్దేశిస్తూ చేసిన ట్వీట్ ను తొలగించారు. ఆ ట్వీట్ ను డిలీట్ చేశానని చెబుతూ మరో ట్వీట్ చేశారు. అంతకుముందు నాగబాబు చేసిన ట్వీట్ రాజకీయ దుమారం రేపింది. ఏపీ సార్వత్రిక ఎన్నికల వేళ అల్లు అర్జున్ పవన్ తరుఫున కాకుండా తన స్నేహితుడు, వైసీపీ నేత శిల్పా రవిచంద్రారెడ్డిని గెలిపించాలని ప్రచారం చేశారు. అయితే దీనిపై మెగా అభిమానులు, జనసేన శ్రేణులు అల్లు అర్జున్‌పై మండిపడ్డారు. నంద్యాలలో అల్లు అర్జున్ పర్యటనను ఉద్దేశిస్తూ నాగబాబు ఆసక్తికర ట్వీట్ చేశారు. మతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మావాడైనా పరాయివాడే మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే అని ట్వీట్ చేశారు. అది కాస్త వైరల్ మారింది. ఇది తీవ్ర దుమారం రేపడంతో ట్వీట్‌ను డిలీట్ చేశారు.


