38.2 C
Hyderabad
Sunday, May 3, 2026
spot_img

ఓటమి భయంతో టీడీపీ దాడులకు పాల్పడుతోంది- సజ్జల

   ఓటమి భయంతో టీడీపీ దాడులకు పాల్పడుతోందని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఓటమి నైరాశ్యంతో హింసను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. కుప్పం, మాచర్ల, తాడిపత్రి, చిత్తూరు, దర్శి నియోజకవర్గాల్లో చెలరేగిన హింసపై ఈసీకి ఫిర్యాదు చేస్తామన్నారు. ఓటు వేసేందుకు వచ్చిన మహిళలపై టీడీపీ నేతలు దుర్బాషలాడుతూ బెదిరింలపుకు పాల్పడ్డారని, అయినా మహిళలు ఓటేసేందుకు పెద్ద ఎత్తున తరలివస్తున్నా రని చెప్పారు. గంగాధర నెల్లూరు, విశాఖ వెస్ట్ నియోజకవర్గాల్లో బౌన్సర్లతో టీడీపీ నేతల హల్‌చల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఈసీని కోరతామన్నారు. ఎన్నికల చరిత్రలో మొదటిసారిగా బౌన్సర్లను దించిన చరిత్ర టీడీపీదని సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు. పలుచోట్ల ఈవీఎంలు పనిచేయకపోవడం, నెమ్మదిగా పనియచేయడం వల్ల వృద్ధులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. కొందరు సిబ్బంది నిర్లక్ష్యంతో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని చెప్పారు. వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఈసీని విజ్ఞప్తి చేస్తామన్నారు సజ్జల.

Latest Articles

ట్రంప్‌ ప్రజాదరణ కోల్పోతున్నారా?.. పని తీరుపై ప్యూ సర్వే ఏం చెబుతోంది?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పనితీరు, చురుకుదనం , ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం వంటి అంశాలపై క్రమంగా ప్రజల నమ్మకాన్ని కోల్పోతున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజాగా ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్