అల్లూరి జిల్లా కాచవరంలో 270 మంది దళితులు ఎన్నికలను బహిష్కరించారు. ఓటు వేసేదే లేదని తెగేసి చెప్పారు. తమ గ్రామానికి దశాబ్దాలుగా రాజకీయ నాయకులు వచ్చి, హామీలు ఇస్తున్నారే తప్ప నెరవేర్చడం లేదని వారు వాపోయారు. తాగునీటి సమస్య తమకు ఇప్పటికీ తీరలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమి పట్టాలు, ఇళ్ల కాలనీలు, పోలవరం పరిహారం ఇస్తామని మోసం చేశారన్నారు. భవిష్యత్తు లో అయినా సమస్యలు తీరిస్తేనే ఓటు వేస్తామని ఎన్నికల అధికారికి దళితులు వినతిపత్రం అందించా రు.


