విభజన, విద్వేష రాజకీయాలు చేస్తున్న బీజేపీని ప్రజలంతా ఓడించాలని రిటైర్డ్ కలెక్టర్ ఆకునూరి మురళి పిలుపుని చ్చారు. బీజేపీని ఓడించాలని కోరుతూ జాగో తెలంగాణ, తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామిక వేదిక నిర్వహిస్తున్న ఓటర్ల చైతన్య యాత్ర సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌కు చేరుకుంది. మోదీ ప్రభుత్వం ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని దేశ యువతను మోసం చేసిందని ఆయన మండిపడ్డారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంతో కేంద్రం నిర్లక్ష్యం వ్యవహరిస్తుందన్నారు. దేశ విద్యా రంగానికి బడ్జెట్ కేటాయింపులను తగ్గించి, విద్యారంగం సంక్షోభానికి కారణమయ్యారని ప్రొఫెసర్ లక్ష్మీ నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే దేశ రాజ్యాంగం కనుమరుగయ్యే ప్రమాద ముందన్నారు.


