నిర్మల్ జిల్లాలో అక్రమ మొరం దందా రోజు రోజుకూ పెరిగిపోతోంది. అక్రమంగా మట్టి తవ్వకాలు యధేచ్చగా జరుగు తోంది. దీంతో ప్రభుత్వం లక్షల్లో ఆదాయం నష్టపోవాల్సి వస్తోంది. మట్టి తవ్వకం దందాపై సంబంధిత అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. అసలు ఎందుకు అధికారులు పట్టించుకోవడంలేదు. మొరం దందా రాయుళ్ల అధికారులకు ముడుపులు చెల్లిస్తున్నారా? అన్న దానిపై స్థానికంగా చర్చనీయాంశమైంది.
నిర్మల్ జిల్లాలో యధేచ్చగా అక్రమ మొరం తవ్వకాలు జరుగుతున్నాయి. అక్రమంగా ఇష్టమొచ్చిన చోట తవ్వకాలు చేస్తూ వాల్దా చట్టానికి తూట్లు పొడుస్తున్నారు కొందరు అక్రమార్కులు. ప్రభుత్వ, ప్రైవేటు భూములు, వాగులు, చెరువు లు, కుంటలు దేనిని అక్రమ దందా రాయుళ్లు వదలట్లేదు. పగలు, రాత్రి తేడా లేకుండా నిరంతరంగా మొరం తవ్వ కాలు కొనసాగుతున్నాయి. జిల్లాలోని చాలా ప్రాంతాల్లోని గుట్టల నుంచి మొరం మోసుకెళ్తూ వెంచర్లలో నింపేస్తున్నారు. అయితే దీనికి పరోక్షంగా అధికారులు అండగా ఉన్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అనుమతులు లేకుండా జరిపిన తవ్వకాల్లో పర్యావరణానికి హాని కలగడంతోపాటు ప్రభుత్వం లక్షల రూపాయల ఆదాయం నష్టపోవాల్సి వస్తుంది. రోజుకు వందల సంఖ్యలో ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా మొరం తరలిపోతుంది. భూమి చదును కొరకు మొరం తరలించా లంటే గనుల శాఖ నుండి అనుమతులు పొందాలి. పట్టా భూముల్లో మొరం తరలించాలంటే హెక్టారుకు 40 వేల చొప్పున గనుల శాఖ వద్ద డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. క్యూబిక్ మీటర్‌కు 30రూపాయలు చెల్లించాలి. వీటితోపాటు రెండు శాతం ఆదాయపు పన్ను, ఒక శాతం కార్మిక పన్ను కట్టాల్సి ఉంటుంది.
నిర్మల్ శివారు ప్రాంతాల్లో మొరం తవ్వకాలు జరుగుతున్నా సంబంధిత శాఖ అధికారులు పట్టి పట్టనట్లు వ్యవహరిస్తు న్నారు. ప్రభుత్వ భూముల నుంచి మొరం తవ్వకాలకు నిషేదం ఉంది. కానీ.. నిర్మల్ భైంసా చుట్టుపక్కల ప్రాంతాల్లో యధేచ్చగా తవ్వకాలు చేస్తున్నారు. గుట్టలను కరిగించి ప్రభుత్వానికి రావలసిన ఆదాయానికి గండికోడుతూ తమ జేబులు నింపుకుంటున్నారు. ప్రభుత్వ సెలవులు, ఆదివారాల్లో అధికా రులు ఉండరని భావించి జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి పెద్ద మొత్తంలో తవ్వకాలు చేస్తున్నారు. బైంసా పట్టణానికి కొద్ది కిలోమీటర్ల దూరంలో ఉన్న గుట్ట నుంచి మొరం తరలిస్తున్నారు. ముధోల్ మండలం, బైంసా మండలం, ఈలేగాం ప్రాంతాలలోని గుట్టల నుంచి మట్టిని మహారాష్ట్రకు తరలిస్తు న్నారు. బోసి బేల్తారోడా శివారులోని బాలాజీ గుట్ట, బోంద్రల్ తదితర ప్రాంతాల్లోని గుట్టల నుంచి మొరం తరలింపు జరుగుతోంది. ఇకనైనా అధికారులు అక్రమ మొరం దందాపై దృష్టి సారించి చర్యలు తీసుకో వాలని ప్రజలు కోరుతున్నారు.


