31.7 C
Hyderabad
Thursday, May 30, 2024
spot_img

వరంగల్ ఎంపీ స్థానంలో రాజకీయ రగడ

   లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించాలని కాంగ్రెస్ ఏరి కోరి పక్క పార్టీ నుంచి వలస నేతని అభ్యర్థిగా ప్రకటించారు. కానీ స్వంత పార్టీ నేతలే ఆ అభ్యర్థి రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఒక అనుభవజ్ఞుడైన నాయకుడు అనకొండలా పార్టీ నేతలనే మింగుతాడని కార్యకర్తల్లో ఒక అంతర్మథనం నుడుస్తోంది. కానీ స్వయంగా పార్టీ అధినేతే గెలిపించాలని పార్టీ నేతలకు టాస్క్ ఇవ్వడంతో ముందు చూస్తే నొయ్యి. వెనుక చూస్తే గొయ్యి అన్న చందంగా మారింది. అని ఆ నియోజకవర్గంలో అధికార పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. పార్టీ గెలవాలి. కానీ అభ్యర్థి ఓడాలని పార్టీ నేతలే స్వయంగా కోరుకుంటు న్నారని మరో టాక్.. ఇంతకీ అది ఏ పార్లమెంట్ నియోజకవర్గం.? ఏంటా అంతర్మథనం.?

   తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల వేడి రాజుకుంది. పోటాపోటీ ప్రచారాలు, మాటల యుద్ధం నడుస్తుంది. అన్ని పార్టీలు తమ అభ్యర్థి గెలవాలని అస్త్ర, శస్త్రాలను ఎన్నికల ప్రచారంలో వాడుతున్నారు. ఈ నేపథ్యంలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఓడించి, ప్రజాపాలన తెచ్చిన కాంగ్రెస్ పార్టీ మరోసారి రాష్ట్రంలో ప్రభంజనం సృష్టించి, అత్యధిక పార్లమెంట్ స్థానాలు గెలుపొం దాలని సన్నహాలు చేస్తుంది. అందుకోసం స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి అన్ని తానై ఎన్నికల ప్రచార పర్వాన్ని ముందుకు నడిపిస్తున్నారు. మార్పు కోరుకున్న ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. అంతేకానీ గ్రౌండ్ లెవల్లో పూర్తి స్థాయిలో పార్టీ బలంగా లేదని సీఎం రేవంత్ రెడ్డి గమనించారు. ఆ మేరకు బీఆర్ఎస్ లో ఉన్నటు వంటి బలమైన నేతలను పార్టీలోకి ఆహ్వానించి ఎంపీ అభ్యర్థులుగా నిలబెట్టారు.

   గతంలో పార్టీ ఫిరాయింపులను వ్యతిరేకించిన సీఎం రేవంత్ రెడ్డి వలస నేతలను అభ్యర్థులుగా ప్రకటించడాన్ని సొంత పార్టీ నేతలే జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా వరంగల్ పార్లమెంట్ స్థానానికి బీఆర్ఎస్ స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యకు టికెట్ ఇవ్వడంతో వరంగల్ సెగ్మెంట్ లోని కార్యకర్తలు అంతా నైరాశ్యంలో ఉన్నారు. విద్యావంతుడు, అనుభవజ్ఞుడు అని కడియం శ్రీహరిని పార్టీలోకి ఆహ్వానించానని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడాన్ని సొంత పార్టీ నేతలే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇన్ని రోజులు పార్టీ జెండా మోసి, పార్టీని నిలబెట్టిన కార్యకర్తలను విస్మరించి
పక్క పార్టీ నేతలను పొగడటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు పార్టీ సీనియర్ నేతల్లో అంతర్మథనం స్టార్ట్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో కడియం శ్రీహరి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోనే ఉంటారనే వాదన సైతం బలంగా వినిపిస్తోంది. కానీ టిడిపిలో బిఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి అనేక మంత్రి పదవులు అనుభవించారు. అయితే ఆయన సొంత పార్టీ నేతలనే ఎదగనీయ కుండా అడ్డుకున్నాడనే అపవాదు కూడా ప్రచారంలో ఉంది. టిడిపిలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలకు నామినేటెడ్ పదవులు ఇవ్వాలని ఆదేశించి నప్పటికీ, కడియం శ్రీహరి అడ్డుకున్నారని జిల్లా నేతలు ఇప్పటికీ చర్చించుకుంటున్నారు.

   కడియం శ్రీహరి దళితులు తనకు పోటీగా వస్తారని, వారికి నామినేటెడ్ పదవులు గాని, ప్రజా ప్రతినిధిగా అవకాశాలు కల్పించ కుండా అనగదొక్కాడని, అందుకే మరోసారి కాంగ్రెస్ లో ఈ పరిస్థితి రాకుండా జాగ్రత్త పడాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ నేతలు ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే పార్టీ నేతలు కడియం శ్రీహరి కోసం కూతురు వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య కోసం పూర్తి స్థాయిలో ప్రచారం చేయడం లేదని ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో చర్చ నడుస్తుంది. కేవలం టిడిపి పార్టీలోనే కాదు బి.ఆర్.ఎస్ పార్టీలో పనిచేసినప్పుడు కూడా పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలు, ఉద్యమకారుల గురించి సీఎం కేసీఆర్ కు చెప్పకుండా ఎలాంటి పదవులు రాకుండా అడ్డుకున్నాడనే అపవాదు ఆయనపై బలంగా ఉంది. అందుకే మరోసారి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కూడా అలాగే చేస్తారనే భయం పార్టీ శ్రేణుల్లో చర్చ నడుస్తోంది.ఏ పార్టీ అయినా మనుగడ సాగించాలంటే ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా కార్యకర్తలు నిలబడి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను నిత్యం ప్రజల్లోకి తీసుకెళ్లేలా ఉండాలి. అలా కష్టపడి పని చేస్తేనే ఏ పార్టీ అయినా మనగడ సాగిస్తుంది లేకపోతే ఓటమి చెందుతుంది. అయితే కడియం శ్రీహరి పై కార్యకర్తల్లో సరైన అభిప్రాయం లేకపోవడంతో పార్టీ శ్రేణులు ఆయనకు దూరం గా ఉంటున్నారు.అందుకే వరంగల్ పార్లమెంటులోని ఆరుగురు ఎమ్మెల్యేలు అలాగే పార్టీ పదవుల్లో ఉన్నవారు పూర్తిస్థాయిలో పనిచేయడం లేదని టాక్ నడుస్తుంది. కనీసం టికెట్ ఆశించిన దొమ్మాటి సాంబయ్య, సింగారపు ఇందిరా, పరమేశ్వర్, ప్రస్తుతం ఎంపీ పసునూరి దయాకర్ తోపాటు జిల్లాకు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మరో మంత్రి సీతక్క కూడా కడియం కావ్య ప్రచారాల్లో గాని మరే ఇతర మీటింగ్ ల్లో ఎక్కడా కనిపించడం లేదని చర్చ నడుస్తోంది.

   గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వీచిన గాలి కారణంగానే అందరు గెలిచినట్టుగా ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా గెలుస్తామని కడియం శ్రీహరి ఊహల్లో తేలి ఆడుతున్నాడని కాంగ్రెస్ పార్టీ శ్రేణులే చర్చించుకుంటున్నారు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించాడని చెప్పినప్పటికీ ఆయనపై పార్టీ శ్రేణుల్లో మాత్రం భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతు న్నాయి. జిల్లాలో ఒక మంత్రి నాలుగు నెలల్లో నాలుగు రోజులు కూడా నియోజకవర్గంలో పర్యటించలేదని, ఒక రాంగ్ మెసేజ్ ని రేవంత్ రెడ్డికి అందించి దగ్గరయ్యాడని జిల్లాలో చర్చ నడుస్తుంది. మంత్రిపైనే అబద్ధాలు చెప్పిన కడియం శ్రీహరి ఎంపీగా తన కూతురు కావ్య గెలిస్తే, ఖచ్చితంగా మంత్ర పదవి తెచ్చుకొని జిల్లాలోని క్యాడర్ ని, నామినేటెడ్ పదవులు ఆశించే నేతలను అణగదొక్కుతాడని పార్టీ శ్రేణుల్లోనే విస్తృతంగా చర్చ నడుస్తుంది. వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలకు ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నా, కేవలం ఇప్పటి వరకు రెండు శాతం ఆధిక్యం మాత్రమే వచ్చేలా ఉందని, మరో 6 రోజుల వ్యవధి ఉండటంతో పార్టీ పరిస్థితి, అభ్యర్థి పరిస్థితి ఇలాగే ఉంటే ఓటమి ఖాయం అని చర్చ నడుస్తుంది. మరి ఇవన్నీ అధిగమించాలి అంటే పార్టీ అధిష్టానం చొరవ తీసుకోవాలి అని పార్టీ శ్రేయస్సు కోరుకునే నేతలు కోరుకుంటున్నారు.వరంగల్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో అపోహలను అంతర్మథనాన్ని పోగొట్టి, ఎమ్మెల్యేలను నేతలను కార్యకర్తలను ఒక తాటిపైకి తీసుకొచ్చే బాధ్యత కడియం శ్రీహరి ఎంపీ అభ్యర్థి కడియం కావ్య పైన ఉంది. మరి ఈ టాస్క్ ను అన్ని తానే పార్టీని ఇటు అభ్యర్థిని తన భుజస్కందాలపై మోస్తున్న కడియం శ్రీహరి ఎలా అధిగామిస్తాడనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది పార్టీ శ్రేణులకు.

Latest Articles

ఇసుక అక్రమ రవాణాపై అనంతపురం కలెక్టర్‌ వార్నింగ్‌

     ఇసుక అక్రమ రవాణాపై అనంతపురం కలెక్టర్ వినోద్‌ కుమార్ వార్నింగ్ ఇచ్చారు. ఎలక్షన్‌ కోడ్‌ అమలులో ఉండటం, పైనుంచి ఆదేశాలు రావడంతో తాడిపత్రి సమీప పెన్నానదిలోని ఇసుక రేవును అధికారులు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్