ఏపీ సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. నిన్న విరామం ప్రకటించిన జగన్.. ఇవాళ మూడు చోట్ల పర్యటించేందుకు సిద్ధమయ్యారు. కూటమి నేతలను టార్గెట్ చేస్తూ, చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఈ ఐదేళ్లలో తాను చేసిన మంచిని వివరిస్తూ, సంక్షేమ పథకాలను గుర్తుచేస్తూ, మరోవైపై ప్రతిపక్ష కూటమిపై విరుచుకుపడుతూ సీఎం జగన్ ప్రచారాన్ని సాగిస్తున్నారు. ఇవాళ మూడు నియోజకవర్గాల్లో ప్రచారంలో భాగంగా కాసేపట్లో బాపట్ల లోక్‌సభ స్థానం పరిధిలోని రేపల్లె కు చేరుకుంటారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం సెంటర్‌లో జరిగే ప్రచార సభలో జగన్ పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు నరసరావుపేట లోక్‌సభ స్థానం పరిధిలోని మాచర్లలో ఉన్న శ్రీనివాస్ మహల్ సెంటర్‌లో జరిగే సభకు ముఖ్యమంత్రి హాజరవుతారు. మధ్యాహ్నం 3 గంటలకు మచిలీపట్నంలోని వల్లూరి రాజా సెంటర్లో జరిగే ప్రచార సభలో జగన్ పాల్గొంటారు. జగన్ కు జనం కూడా ఘన స్వాగతం పలుకుతున్నారు.


