27.7 C
Hyderabad
Sunday, July 13, 2025
spot_img

అందరి దృష్టి ఈ లోక్ సభ స్థానంపైనే…

   తెలంగాణలోనే కాదు. దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ స్థానం మల్కాజ్ గిరి. ఏకంగా 38 లక్షల మంది వరకు ఓటర్లు ఉన్న నియోజకవర్గం. మరి అలాంటి చోటు నుంచి పోటీ అంటే ఆషామాషీగా ఉండదు. అందుకే ఏకంగా 30 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు.మినీ భారత్‌గా అభివర్ణించే ఈ సీటు నుంచి గెలిచే అదృష్టవంతులెవరు ? లోక్ సభ ఎన్నికల వేళ అందరి దృష్టీ ప్రధానంగా ఈ సీటుపైనే నెలకొంది.

    తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఈనెల 13న జరగనున్న పోలింగ్ కోసం కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రా న్ని చేజిక్కించుకున్న హస్తం పార్టీ.. పార్లమెంటు ఎన్నికల్లోనూ విజయం సాధించి ఆ గెలుపును సుస్థిరం చేసుకోవాలని భావిస్తుండగా, శాసనసభ ఎన్నికల్లో ఓడిన బీఆర్ఎస్ ఎంపీ ఎన్నికల్లో సత్తా చాటాలని ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపుసాధ్యమైనన్ని ఎక్కువ స్థానాలు తెలంగాణలో సాధించి రాష్ట్రంపై పట్టు సాధించడంతోపాటు కేంద్రంలో మోడీ సర్కారు వచ్చేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తోంది రాష్ట్ర బీజేపీ. ఇలాంటి నేపథ్యంలో పార్టీల అందరి దృష్టీ మల్కాజ్ గిరి పార్లమెంటు నియోజక వర్గంపైనే ఉంది. నిజానికి ఈ ఎంపీ సీటు అంటే మినీ ఇండియానే అని చెప్పాలి. దేశంలోని అన్ని ప్రాంతాలు, వర్గాలకు చెందిన ఓటర్లు ఇక్కడ ఉంటారు. గ్రేటర్ హైదరాబాద్ లో అంతర్భాగంగా ఉంది మల్కాజ్ గిరి లోక్ సభా స్థానం. ఈ ఎంపీ సీటు పరిధిలో కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్, మేడ్చల్, మల్కాజ్ గిరి, ఉప్పల్, ఎల్బీ నగర్, కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఎన్నో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు, యూనివర్శిటీ లు, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ వంటి స్థావరాలు, ఆర్థిక సంస్థలు..ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణకు ఆర్థికంగా ఎంతో రెవెన్యూ తీసుకువచ్చే ప్రాంతం మల్కాజ్ గిరి అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు.

  2009 నియోజకవర్గాల పునర్విభనజలో భాగంగా ఏర్పాటైంది ఈ లోక్ సభా స్థానం. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన సర్వే సత్యనారాయణ గెలుపొందారు. అనంతరం 2014 ఎలక్షన్లలో టీడీపీ తరఫున బరిలో దిగిన చామకూర మల్లారెడ్డి విజయం సాధించారు. ఇక, 2019లో కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి పోటీ చేసి ఘన విజయం సాధించారు. పైగా ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎంగా ఉండడంతో ఈ సీటు కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది. అన్ని పార్టీలకు ఎంతో ప్రధానంగా ఈ స్థానం మారడంతో అభ్యర్థుల విషయంలో ఆచితూచి వ్యవహరించాయి పార్టీలు. అంగ, అర్థబలం పుష్కలంగా ఉన్న వారిని పోటీకి దించాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాపై గట్టి పట్టున్న మాజీ మంత్రి పట్నం మహేంద్ రెడ్డి సతీమణి, వికారాబాద్ జెడ్పీ ఛైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డికి టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించాలని ఈ నియోజకవర్గానికి సీనియర్ నేత, మంత్రి తుమ్మలను ఇన్ ఛార్జ్‌గా నియమించారు. అయితే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఎంపీ సీటు పరిధిలో ఒక్క శాసనసభా స్థానం కూడా గెలుచుకోకపోవడంతో సర్వశక్తులూ ఒడ్డుతున్నారు హస్తం నేతలు.

      ఇప్పటివరకు ఒక్కసారి కూడా గెలవని మల్కాజ్‌గిరి పార్లమెంటు స్థానం కైవసం చేసుకునేందుకు పెద్ద స్కేచ్చే వేస్తోంది బీఆర్ఎస్. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్లమెంటు పరిధిలోని అన్ని స్థానాలను గెలుచుకున్న కారు పార్టీ మల్కాజ్ గిరి అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డిని ఎంపిక చేసింది. అటు.. కమల నాథులు సైతం పెద్ద ప్లానే వేస్తున్నారు. మినీ భారత్‌గా ఈ స్థానం ఉండడంతో ప్రధాని సహా అగ్రనేతల రోడ్ షోలు ఏర్పాటు చేసి, రానున్న ఎన్నికల్లో పైచేయి సాధించాలని భావిస్తున్నారు. పార్టీలో కీలక నేతగా ఉన్న ఈటెల రాజేందర్‌ను కమలం అభ్యర్థిగా నిలిపారు. కేంద్రంలో మోడీ సర్కార్‌పై ఉన్న సానుకూల భావన తమకు కచ్చితంగా కలిసి వస్తుందని భావిస్తున్నారు. మొత్తంగా చూస్తే, ఎవరి వ్యూహాలు వారివే. ఎవరి ప్రచారం వారిదే. ఎవరి ధీమా వారిదే.! మరి తుది పోరులో పైచేయి సాధించేది ఎవరు అనే అంశంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్