తూర్పుగోదావరి జిల్లా అనపర్తి టిక్కెట్ విషయంలో సస్పెన్స్ కొనసాగుతోందా.? టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయాలని భావిస్తోన్న నల్లమిల్లి రామకృష్ణారెడ్డి టికెట్‌పై ఇంకా స్పష్టత రాలేదని తెలుస్తోంది. కూటమికి సంబంధించిన కొన్ని నియోజకవర్గాల్లో టిక్కెట్ల వ్యవహారం కాకరేపుతోంది. కూటమిలో సీట్ల సర్దుబాటు వ్యవహారం గందరగోళంగా మారుతోంది. జనసేన పార్టీ సీట్లు సర్దుబాటు పూర్తి కాగా.. అభ్యర్థులందరికీ పవన్‌కళ్యాణ్ బీ ఫామ్స్ ఇవ్వడం, కొందరు నామినేషన్స్ వేయడం జరుగు తోంది. కానీ.. టీడీపీ, బీజేపీ మధ్య మాత్రం కొన్ని సీట్ల సర్దుబాటు విషయంలో ఇంకా క్లారిటీ రావడం లేదు. ముఖ్యంగా.. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి స్థానాన్ని బీజేపీకి కేటాయించడంపై టీడీపీ కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దాంతో.. అనపర్తి రాజకీయం కూడా ఉండి పొలిటి కల్ డ్రామాకి మించిపోతోంది. ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లతో అనపర్తి క్యాడర్ కన్‌ఫ్యూజ్ అవుతోంది.
ఇదిలావుంటే, బీజేపీలో చేరాలంటూ నల్లమిల్లి రామకృష్ణారెడ్డిపై ఆ పార్టీ పెద్దల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. తమ పార్టీలో చేరితే అనపర్తి సీటు ఇస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. అటు.. కొందరు టీడీపీ ముఖ్యనేతలు కూడా బీజేపీలో చేరాల్సిందిగా రెండు రోజులుగా రామకృష్ణారెడ్డితో ఫోన్‌లో మంతనాలు చేస్తున్నారు. నల్లమిల్లి రామకృష్ణ రెడ్డితో టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి, సుజయ్ కృష్ణ రంగారావులు మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. టిక్కెట్ ఇవ్వకపోవటానికి గల కారణాలను నల్లమిల్లికి వివరించారు. జెండా ఏదైనా కూటమి అజెండా గెలవాలన్న చంద్రబాబు సూచన మేరకు నల్లమిల్లి కూడా పునరాలోచనలో పడినట్లు సమాచారం. నల్లమిల్లితో ఫోన్లో మాట్లా డిన చంద్రబాబు, క్షేత్ర స్థాయి పరిస్థితులు వివరించి సర్దిచెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు బీజేపీ లోకి రావాలని నల్లమిల్లికి ఆ పార్టీ అధిష్టానం నుంచీ కూడా ఆహ్వానం అందినట్లు సమా చారం. ఇవాళ తన అనుచరులతో సమావేశమై నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి రాజకీయ నిర్ణయం ప్రకటిం చనున్నట్లు తెలుస్తోంది.


