ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడింది. నామినేషన్ల పర్వం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో ఇవాళ టీడీపీ అభ్యర్థులకు బీ-ఫారాలు ఇవ్వనున్నారు పార్టీ అధినేత చంద్రబాబు. కొన్ని సెగ్మెంట్లల్లో అభ్యర్థి త్వాల మార్పుపై తర్జన భర్జనలో ఉంది టీడీపీ. కొలిక్కి రాని సీట్లల్లోని అభ్యర్థులకు బీ-ఫారాల జారీని పెండింగులో పెట్టే ఛాన్స్ ఉంది. చివరి నిమిషంలో దెందులూరు టిక్కెట్టుపై ట్విస్ట్ నెలకొంది. బీ-ఫారం తీసుకోవడానికి రావొద్దని చింతమనేనికి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం బీ-ఫారం తీసుకోవడానికి రావాలని చింతమనేనికి సూచనలు చేశారు. ఈ నేపథ్యంలో నామినేషన్ వేయడానికి సిద్దమవుతున్నారు చింతమనేని. అయితే, బీజేపీతో అనపర్తి సీట్ ఎడ్జస్ట్మెంటులో భాగంగా దెందులూరు విషయమై టీడీపీ కసరత్తు చేస్తోంది. మడకశిర, ఉండి, పాడేరు, సుళ్లూరుపేట, మాడుగుల వంటి సెగ్మెంట్లల్లో అభ్యర్థులను మారుస్తారనే ప్రచారం జరుగుతోంది.


