ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 20 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. మహారాష్ట్రలోని నాందేడ్ నుండి ఆదిలా బాద్ వైపు వస్తున్న మ్యాక్స్ పికప్ వ్యాన్ ను మరో వాహనం ఢీకొట్టింది. సుంకిడి అంతరాష్ట్ర రహదారి పై ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 20 మందికి గాయాలు కాగా, ఆరుగురికి తీవ్ర గాయాల య్యాయి. వెంటనే క్షతగాత్రులను 108 అంబులెన్స్ లో రిమ్స్ కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


