లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో 14 ఎంపీ సీట్లలో కాంగ్రెస్‌ను గెలిపిస్తే ముదిరాజ్ బిడ్డను మంత్రిగా చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో 10శాతంగా ఉన్న ముదిరాజ్‌లకు కేసీఆర్ ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదని విమర్శించారు. నారాయణపేటలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో సీఎం రేవంత్. కేసీఆర్‌పై మండిపడ్డారు. గడిచిన పదేళ్లలో కేసీఆర్ ఎంతమందికి రెండు పడక గదుల ఇళ్లు ఇచ్చారో చెప్పాలని రేవంత్ డిమాండ్ చేశారు. కేసీఆర్ పదేళ్లలోనే వందేళ్ల విధ్వంసాన్ని సృష్టించారని మండిపడ్డారు. జైలులో ఉన్న కవితను కాపాడుకునేందుకు బీఆర్ఎస్ పార్టీని మోదీకి తాకట్టుపెట్టారని ఆరోపించారు.


