ఓటమి భయంతోనే టీడీపీ నేతలు దాడులు చేయిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ అన్నారు. జగన్‌పై దాడిని ఖండిస్తూ విజయవాడలో నల్ల రిబ్బన్లతో నిరసన చేపట్టిన అవినాష్… నగరంలో సీఎంపై రాయి దాడి బాధాకర విషయమన్నారు. జగన్‌కు వస్తున్న ప్రజా స్పందన చూసి ఓర్వలేక దాడి చేశారని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీకి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. జగన్‌పై దాడి ఘటనలో పూర్తి స్థాయి విచారణ కోరుతున్నామన్నారు. ఎన్నికల కమిషన్ దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. జగన్‌పై రాయి దాడి వెనుక చంద్రబాబు, లోకేష్ హస్తం ఉందన్నారు దేవినేని అవినాష్.


