హైదరాబాద్ ఎల్బీనగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
హైదరాబాద్ ఎల్బీ నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనక నుండి కారు ఢీకొ ట్టింది. ఈ ప్రమా దంలో ఇద్దరు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. కోదాడ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
జగన్ పాలనపై టీడీపీ అభ్యర్థి కాల్వ ఫైర్
జగన్ ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో అరాచక పాలన సాగిందని విమర్శలు గుప్పించారు రాయదుర్గం టీడీపీ అభ్యర్థి కాల్వ శ్రీనివాసులు. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న శ్రీనివాసులు.. గొడుసుపల్లిలో నిర్వహించిన జయహో బీసీ కార్యక్రమంలో పాల్గొన్నారు. మద్యం మాఫీ అన్న మాటను మరిచి 20 ఏళ్లకు సరిపడా సంపాదించుకున్నారని ధ్వజమెత్తారు. అధికారం కోసం సొంత చిన్నాన్ననే చంపిన వ్యక్తి జగన్ అని విరుచుకుపడ్డారు.
కాకినాడ జిల్లాలో వైసీపీ అభ్యర్థుల సమావేశం
పిఠాపురంపై మరింత ఫోకస్ పెంచారు వైసీపీ ముఖ్య నేతలు. ఈ నేపథ్యంలోనే కురసాల కన్నబాబు నివాసంలో.. ముద్ర గడ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి జిల్లా ఇన్‌చార్జ్ మిథున్ రెడ్డి తోపాటు వైసీపీ ఎంపీ, అసెంబ్లీ అభ్యర్థులు హాజరయ్యారు. వంగా గీత, వరుపుల సుబ్బారావు, దవులూరి దొరబాబు, పెండెం దొరబాబు, ఎం.ఎల్.సి అనంతబాబు, ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ ఐప్యాక్ టీమ్‌తో.. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల గెలుపే అజెండాగా సమావేశం జరుగుతోంది.
మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై రఘునందన్‌రావు ఫైర్
మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు. సంగారెడ్డి జిల్లా సదాశివ పేట ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. జగ్గారెడ్డికి రాజకీయ భిక్ష పెట్టిందే బీజేపీ అని అన్నారు. ఆ పార్టీ నుంచే కౌన్సిలర్‌గా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారని.. అలాంటి జగ్గారెడ్డికి రాముడు ఇప్పుడు రావణాసురుడిలా కనిపిస్తున్నారని మండిపడ్డారు.
అదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో ఒక్కసారిగా చల్లబడిన వాతావరణం
వేసవి వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఇన్ని రోజులుగా భానుడి ప్రతాపంతో అగ్నిగుండంగా మారిన అదిలాబాద్, నిర్మల్ జిల్లాల వాసులు వాతావరణంలో వచ్చిన మార్పుతో ఉపశమనం పొందు తున్నారు. ఏరువాక పౌర్ణమి వచ్చే జూన్ మాసాన్ని ప్రస్తుత వాతావరణం తలపిస్తోంది. నిన్న, మొన్నటి వరకు 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా ఇప్పుడు 5,7 డిగ్రీలు మేర తగ్గి 37 డిగ్రీల మేర నమోదు అవుతోంది. దీనికితోడు రాత్రి చిన్నిపాటి వర్షం కూడా పడటంతో జిల్లా వాసులు చల్లటి వాతావరణంలో సేదతీరుతున్నారు.