19.7 C
Hyderabad
Tuesday, January 27, 2026
spot_img

స్వతంత్ర సంక్షిప్త వార్తలు

పదివేల 902 శ్లోకాలతో…

అయోధ్య బాలరాముడికి బంగారు రామాయణం కానుకగా లభించింది. సుమారు 5 కోట్ల రూపాయలు విలువ చేసే ఏడు కిలోల బంగారు రామాయణాన్ని విశ్రాంత IAS అధికారి లక్ష్మీనారాయణ్‌ సిద్దం చేయిం చి రామ్‌లల్లాకు కానుకగా అందించారు. 500 బంగారు పేజీలపై రాసిన ఈ రామాయణాన్ని అయోధ్య ప్రధానాలయంలో ఉంచారు. పది వేల 902 శ్లోకాలతో కూడిన ఈ బంగారు రామాయణానికి సంబంధిం చిన ప్రతీ పేజీపై 24 క్యారెట్ల బంగారు పూత పూశారు. దీని తయారీలో 140 కిలోల రాగిని కూడా వినియో గించారు.

అమ్మవారి నిజరూప దర్శనం

శ్రీభ్రమరాంబికా సమేత మల్లిఖార్జునస్వామివారి ఉగాది మహోత్సవాలు ఘనంగా ముగిసాయి. ఐదు రోజులపాటు జరిగిన ఉత్సవాల్లో చివరిరోజు శ్రీ భ్రమరాంబికాదేవి భక్తులకు నిజరూప దర్శనం ఇచ్చారు. అశ్వవాహనధీసుడైన శ్రీస్వామి అమ్మవారి ఉత్సవమూర్తులకు అర్చకులు,వేదపండితులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి కర్పూరహా రతులిచ్చారు అనంతరం ఆలయ ప్రాకరోత్సవం గావించారు.

పోటెత్తిన భక్తులు

కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కైరుప్పల గ్రామంలో జరిగిన పిడకల సమరంకు భక్తులు పోటెత్తారు. త్రేతాయుగంలో భద్రకాళిక అమ్మవారు, వీరభద్రస్వామివార్ల మధ్య ప్రేమ వివాహ వివాదం నేపధ్యంలో జరిగిన సమరంను పిడకల సమరంగా అనాదిగా పాటిస్తున్నారు గ్రామస్తులు. ఈ కార్యక్రమం జరిగిన మరుసటి రోజు స్వామి, అమ్మవార్లకు వివాహ వేడుకను నిర్వహించడం ఆనవాయితీ.

అంగరంగ వైభవంగా…

నిర్మల్ జిల్లా బాసర ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పల్లకి సేవ అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పల్లకి సేవను పుర వీధుల గుండా నిర్వహించగా, పల్లకీని మోస్తూ ముందుకుసాగారు భక్తులు. గోవిందుని నామస్మరణలు మిన్నంటగా, పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళలు స్వామివారికి కర్పూర నీరాజనాలు పలికారు.

ఆంజనేయుని రధోత్సవం

అనంతపురం జిల్లా కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి రథోత్సవం కన్నుల పండువగా సాగింది. ఈ రధోత్సవంకు భక్తులు భారీగా తరలివచ్చారు. విద్యుత్ దీప కాంతులతో ఆలయాన్ని సర్వాంగ సుందరం గా తీర్చిదిద్దారు. తొలుత శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి వారి ఉత్సవ మూర్తులను రథంపై కొలువుదీర్చిన పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జైశ్రీరామ్ నామస్మరణల నడుమ భక్తులు రథాన్ని లాగారు.

ఈద్‌ ముబారక్‌

తెలుగురాష్ట్రాల్లో రంజాన్‌ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వేకువజామునే ముస్లిం సోదరులు దర్గాల వద్ద ప్రత్యేక ప్రార్ధనలు చేసారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా జరిగిన రంజాన్ వేడుకల్లో ముస్లింలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. ఈద్‌ముబారక్‌ అంటూ శుభాకాంక్షలు తెలుపు కున్నారు.

స్టాలిన్‌ ఘాటు వ్యాఖ్యలు

దేశంలోని బీజేపీ ప్రభుత్వంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ విమర్శనాస్త్రాలు సంధించారు. తమిళనాడులో పర్యటిస్తున్న ప్రధాని మోదీ ఇస్తున్న గ్యారెంటీలపై సవాల్‌ విసిరారు. ట్విట్టర్‌ వేదికగా ఓ జాబితాను పోస్టు చేసిన స్టాలిన్‌… జాబితాలో ప్రస్తావించిన సమస్యల్ని పరిష్కరించగలరా అంటూ ప్రశ్నిం చారు. ప్రధాని రాష్ట్ర పర్యటనను పక్షుల వలసతో పోల్చారు స్టాలిన్‌. ఎన్నికల బాండ్ల వ్యవహారం, చైనా ఆక్రమించిన భూభాగం, కులగణన వంటి అంశాలను ఈ జాబితాలో ప్రస్తావించారు స్టాలిన్‌.

డీప్‌ఫేక్‌ వీడియోలు

డీప్‌ఫేక్‌ వీడియోలు ఎవ్వరినీ వదలడంలేదు. నేషనల్‌ స్టాక్‌ ఎక్ఛ్సేంజ్‌ – NSE సీఈఓ అశిష్‌కుమార్‌ చౌహాన్‌కు ముప్పు తప్పలేదు. పెట్టుబడులు పెట్టాలంటూ ఆయన ప్రచారం చేస్తున్నట్లు డీప్‌ఫేక్‌ వీడియో లు నెట్టింట వైరల్‌ కావడంతో NSE స్పందించింది. పెట్టుబడులు పెట్టాలనుకొనేవారు ఇలాంటి ఆడియో , వీడియోలు నమ్మెద్దు…. నకిలీ వీడియోలు, ఇతర మాధ్యమాల నుంచి వచ్చే పెట్టుబడి సలహాలు అను సరించొద్దు అంటూ విజ్ఞప్తి చేసింది. స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌కు ఏ సమాచారమైనా తమ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి మాత్రమే వస్తుందని తెలిపింది.

వర్గ విభేదాలు

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో వైసీపీ నాయకుల మధ్య విభేదాలు తారాస్ధాయికి చేరాయి. మున్సిపల్‌ చైర్ పర్సన్ భర్త పిలక దేవరాజ్ తీరును తప్పుపడుతూ వైస్ చైర్ పర్సన్ ఉలాల భారతి దివ్య పోలీస్‌స్టేషన్‌ మెట్లు ఎక్కారు. పిలక దేవరాజ్‌ అసభ్య పదజాలంతో అవమానకరంగా వ్యవహరిస్తున్నా రంటూ కన్నీరు పెట్టుకున్నారు దివ్య.

పోలీసుల కవాతు

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తిరుపతి జిల్లాలోని సూళ్లూరుపేట, ఎస్వీ యూనివర్సిటీ క్యాంపస్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో స్ధానిక పోలీసులు కేంద్ర సాయుధ బలగాలతో కలసి ప్లాగ్‌ మార్చ్‌ నిర్వహించారు. జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ పటేల్ ఆదేశాల మేరకు సమస్యాత్మక ప్రాంతాల మీదుగా ఈ మార్చ్‌ సాగింది. ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ముందుకురావాలని పిలుపునిచ్చారు అధికారులు.

ముమ్మర తనిఖీలు

ఆంధ్రా, తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన శ్రీశైలం లింగాలగట్టు వద్ద అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ ను తనిఖీ చేసారు నంద్యాల ఎస్పీ రఘువీర్ రెడ్డి. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అప్రమత్తంగా ఉండాంటూ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రతి ఒక్క వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశించారు.

దొంగలు హల్‌చల్‌

వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపాలిటీ కేంద్రంలో దొంగలు హల్‌చల్‌ చేసారు. అర్ధరాత్రి షాపుల తాళాలు పగలగొట్టి 25వేల రూపాయల నగదు, మొబైల్‌ పోన్లను దొంగిలించారు. షాపుల యజమానుల ఫిర్యాదు మేరకు క్లూస్‌టీమ్‌తో దర్యాప్తు చేపట్టారు పోలీసులు.

ఆలయంలో చోరీ

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం మునకుళ్ళ శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో చోరీ జరిగింది. ఆల య గేట్లను ధ్వంసం చేసి లోపలకు ప్రవేశించిన దుండగులు హుండీని పగలగొట్టి నగదును దొంగి లించా రు. సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన చోరీ దృశ్యాలు ఆధారంగా పోలీసులు విచారణ చేస్తున్నారు.

సనత్‌నగర్‌ వెల్ఫేర్ గ్రౌండ్ లో రంజాన్ సామూహిక ప్రార్ధనలు

హైదరాబాద్‌ సనత్‌నగర్‌లోని రంజాన్ సామూహిక ప్రార్ధనల్లో పాల్గొన్నారు మాజీమంత్రి, MLA తలసాని శ్రీనివాస్ యాదవ్. సనత్ నగర్‌ వెల్ఫేర్ గ్రౌండ్ లో జరిగిన ఈ ప్రత్యేక ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరు ల్ని ఆలింగనం చేసుకుని రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రార్ధనలకు ముస్లిం సోదరులు వేలాదిగా తరలివచ్చారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని గ్రీటింగ్స్‌ చెప్పుకున్నారు.

సిద్దిపేటలో రంజాన్ వేడుకల్లో పాల్గొన్న హరీష్ రావు

రంజాన్ పర్వదినం సందర్బంగా సిద్దిపేట పట్టణంలోని గద్ద బొమ్మ వద్ద రంజాన్ వేడుకల్లో మాజి మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో అలై బలై తీసుకొని రాష్ట్రంలోని ముస్లిం సోదరు లందరికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఉపవాస దీక్ష అనంతరం రంజాన్ పండుగ మైనారిటీలకు అత్యంత ప్రధానమైన పండుగ అని చెప్పారు. అల్లా దయతో మైనరిటీలందరికి అంతా మంచి జరగాలని కోరుకున్నారు.

సిద్దిపేటలో రఘునందన్ రావు పర్యటన

మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్‌ రావు సిద్దిపేట పట్టణంలో పర్యటించారు. డిగ్రీ కాలేజి కోమటి చెరువు వద్ద మార్నింగ్ వాకర్స్‌ని కలిసి మాట్లాడారు. దేశంలో ప్రధాని మోదీ చేస్తున్న అభివృద్ధి గురించి వివరిం చారు. మూడోసారి మోడీ ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ లాంటి వాళ్ళు కాదు.. అన్నా హజారే లాంటి వాళ్లు దేశానికి కావాలన్నారు. 2018 మేనిఫెస్టో పై రాజకీయం చేస్తున్నారన్న రఘునందన్‌ .,.తాను ఇచ్చిన హామీలపై అంబేద్కర్ చౌరస్తాలో చర్చకు సిద్ధమని చెప్పారు.

శ్రీకాకుళం జిల్లాలో రంజాన్ వేడుకలు

శ్రీకాకుళం జిల్లాలో రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మంత్రి ధర్మాన ప్రసాదరావు పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రంలో అతిపెద్ద చారిత్రాత్మక నేపథ్యం కలిగిన మసీదుల్లో జామియా మసీదు ఒకటి అని కొనియాడారు. నరసన్నపేట, పాతపట్నం మండలాల్లో ఉన్న మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు ముస్లీం సోదరులు. మత సామరస్యానికి ప్రతీక ఈద్ ముబారక్ అని మంత్రి తెలిపారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్