తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు కర్రిగుట్ట అటవీ ప్రాంతంలో గతకొద్ది రోజుల క్రితం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌం టర్ జిల్లాలో అలజడి సృష్టించింది. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందడం, అందులో భూపాలపల్లి జిల్లా కాటారం మండలానికి చెందిన సంతోష్ అలియాస్ సాగర్ ఉండటం సంచలనం కలిగించింది. దీంతో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. కూంబింగ్‌ను ముమ్మ రం చేశారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు కదలికలు పోలీసులను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
ఆదిలాబాద్, మహారాష్ట్ర సరిహద్దులో ఇటీవల భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో మొత్తం 13 మంది మావోయి స్టులు హతమయ్యారు. ఈ నేపథ్యంలోనే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన ఛత్తీస్‌గఢ్, గోదావరి సరిహద్దులో జిల్లా పోలీసులు నిఘా పెంచారు. పౌరుల రాకపోకలపై కన్నేశారు. విస్తృతంగా వాహనాలను తనిఖీ చేయడంతోపాటు ఇన్ఫార్మర్ వ్యవస్థను అలర్ట్ చేశారు. తాజాగా, ఇరు రాష్ట్రాల సరిహద్దు పోలీసులు వాజేడు మండలంలో సమావేశమ య్యారు. దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు జరుగుతుండగా మావోయిస్టుల నుంచి ఎలాంటి అవాంఛనీయ ఘటన ఎదురవ్వకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరిపించే విషయమై చర్చించినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. ఈ సమావేశంలో మావోయిస్టులకు చెక్‌పెట్టే పలు అంశాలపై ఇరు రాష్ట్రాల పోలీసులు సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకున్నట్లు తెలిసింది. వ్యూహాత్మకంగా అడుగులు వేసే క్రమంలో కర్రిగుట్ట అటవీ ప్రాంతంలో మావోయిస్టు కదలికలు ఉన్నట్లు నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారంతో గ్రే హౌండ్స్ పోలీసులు శుక్రవారం నుంచి సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టినట్లు తెలిసింది.
ములుగు జిల్లా పోలీసులు, సరిహద్దు స్టేషన్లలో సుదీర్ఘకాలం పనిచేసి ఈ ప్రాంతంపై అవగాహన ఉన్న అధికారులను రంగంలోకి దించినట్లు సమాచారం. అనుకున్నట్టుగానే పోలీసులు టార్గెట్‌ను రీచ్ అయ్యారు. దీంతో ఓ రాష్ట్రస్థాయి నాయకుడి తోపాటు మొత్తం ముగ్గురు సభ్యులను మావోయిస్టులు కోల్పోయారు. ఈ ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశం ఛత్తీ స్గఢ్ రాష్ట్రం ఊసూరు పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుండటంతో అక్కడి పోలీసులు మృతదేహాలను తరలించారు. ఈ ఎన్ కౌంటర్‌ను ధృవీకరిస్తూ…బీజాపూర్ ఎస్పీ జితేందర్ యాదవ్ ప్రకటన జారీ చేశారు. ప్రకటన వెలువడిన కొద్ది గంటలకే మావోయిస్టులు ఈ ఘటనపై స్పందించారు. ఆజాద్ పేరిట ఓ లేఖ విడులైంది. పక్కా సమాచారంతోనే పోలీసులు ఎన్‌కౌంటర్‌కు పాల్పడ్డారని, ములుగు ఎస్పీ ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ జరిగిందని పేర్కొన్నారు.
తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో శనివారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. దీంతో తెలంగాణ సరిహద్దు, ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీజాపూర్ జిల్లా పుజారాకాంకేర్ గ్రామ సమీపంలో గల అటవీ ప్రాంతంలో ఛత్తీస్‌గఢ్ పోలీసుల తోపాటు గ్రేహౌండ్స్ బలగాలు జాయింట్ యాంటీ నక్సల్స్ ఆపరేషన్‌లో భాగంగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈనేపథ్యంలోనే మావోయిస్టులు తారసపడడం తో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. అనంతరం ఘటనా ప్రాంతంలో ఏకే-47, ఎల్ఎంజీ, విప్లవ సాహిత్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలు స్తోంది. మృతుల్లో సీపీఐ మావోయిస్టు పార్టీ సీఆదీనే-2 కమాండర్ అన్నె సంతోష్ అలియాస్ సాగర్ అలియాస్ శ్రీధర్, మరొకరు మణిరామ్, ఇంకొకరిని గుర్తించాల్సి ఉంది. మణిరామ్, మరొకరు బీజాపూర్ జిల్లా పుజారాకాంకేర్ గ్రామానికి చెందిన వారుగా సమాచారం.
తెలంగాణలో చివరిసారిగా 2022 జనవరి 18న ఇదే కర్రిగుట్ట అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో వాజేడు, వెంకటాపురం ఏరియా కమిటీ కార్యదర్శి మడకం సింగి అలియాస్ శాంత, గుండాల, నర్సంపేట ఏరియా కమిటీ కమాండర్ కొమ్ముల నరేష్ అలియాస్ బుచ్చన్న, మరో మావోయిస్టు సభ్యుడు మృతి చెందాడు. పెద్ద సంఖ్యలో మావోయిస్థులు సంచరిస్తున్నారనే పక్కా సమాచారంతో రెండు రోజులుగా..ఛత్తీస్‌గడ్ సీఆర్పీఎఫ్, తెలంగాణ పోలీసులు సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. ఆరోజు ఉదయం 7గంటల ప్రాంతంలో మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకు న్నాయి. దాదాపు రెండు గంటల పాటు ఇరు వర్గాల నడుమ కాల్పులు జరగగా గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ మధుకు బుల్లెట్ గాయమైంది. ఈ ఎదురు కాల్పుల ఘటన నుంచి వాజేడు, వెంకటాపురం ఏరియా కమిటీ కార్యదర్శి సుధాకర్ తప్పించుకోగా, భార్య శాంత మృతి చెందింది.
మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉండే ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ సరిహద్దు మీదుగా నిత్యం నక్సల్స్ కదలికలు ఉంటాయి. పార్టీ కార్యకలాపాలను రాష్ట్రంలో విస్తరించే క్రమంలో మావోయిస్టులు సరిహద్దు దాటేందుకు ప్రయత్నించిన ప్రతీసారి తెలంగాణ పోలీసులు తిప్పికొడుతున్నారు. పోలీసులే లక్ష్యంగా అమర్చిన మందుపాతరలు, మారణాయుధా లను పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఎదురు కాల్పులు చోటుచేసుకుంటున్నాయి. కొన్ని సందర్భాల్లో మావోయిస్థులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది.
గడిచిన నాలుగేళ్లలో జరిగిన ఎన్‌కౌంటర్ ఘటనలను పరిశీలిస్తే…2020 సెప్టెంబరు 3న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం దేవర్లగూడెం అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్‌లో ఓ మావోయిస్టు, 20వ తేదీన చర్ల మండలం పూసుగుప్ప అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు, అదే నెల 23వ తేదీన చర్ల మండలం జన్నారం అడవుల్లో జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. అక్టోబరు 18న ములుగు జిల్లా మంగపేట మండలం కొప్పు గుట్ట వద్ద జరిగిన ఎన్ కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో ఒకరు మణుగూరు ఏరియా కమాండర్ సుధీర్. ఇదే నెల 25న వాజేడు మండలం టేకులగూడెంలో జరిగిన ఎన్ కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు, 2021 ఆగస్టు 1వ తేదీన చర్ల మండలం బోదనెల్లి అటవీ ప్రాంతంలో ఒక మావోయిస్టు మృతి చెందాడు. డిసెంబరు 28న పెసళ్లపాడులో జరిగిన భారీ ఎన్ కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతి చెందడం జరిగింది. తాజా జరిగిన ఎన్‌కౌంటర్‌తో సరిహద్దు పల్లెలు అట్టుడుకుతు న్నాయి. ఆదివాసీ గూడాలు, గొత్తికోయ గుంపులపై పోలీసులు నిఘా పెంచారు. వాహనాల తనిఖీలను జరుపుతున్నారు. గోదావరి పరివాహక ప్రాంతం, ఏజెన్సీ ప్రజలు, గుత్తి కొయ్యలు, చిట్టచివరి పల్లెల జనం ఏ టైంలో ఏం జరుగుతుందోనని భయాందోళనకు గురవుతున్నారు.


