హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. క్రోధి నామ సంవత్సర పంచాం గాన్ని ఆవిష్కరించారు. అనంతరం బాచుపల్లి సంతోష్‌కుమార్ శాస్త్రి పంచాంగ పఠనం చేశారు. ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు మంత్రి జూపల్లి కృష్ణారావు. వ్యవసాయ సంవత్సరంగా పరిగణించే ఈ ఉగాది నవ వసంతంలో రైతులకు మేలు కలగాలని కోరుకున్నారు. ప్రజలందరి కొత్త ఆశయాలు నెరవేరి సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ ఏడాది వర్షాలు సమృద్దిగా కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు.


