తాడేపల్లి సిట్ కార్యాలయం కాంపౌండ్‌లో హెరిటేజ్ సంస్థకి సంబంధించిన డాక్యుమెంట్లను కార్యాలయ సిబ్బంది తగులబెట్టారు. హెరిటేజ్ పత్రాలు దగ్ధం చేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికులు పత్రాలను తగలబెడుతున్న సిబ్బందిని ప్రశ్నించి, వీడియోలు తీశారు. పత్రాలు తగలబెట్టిన వీడియోలు తమకి ఇవ్వమని సీఐడీ కార్యాలయ సిబ్బంది స్థానికులపై ఒత్తిడి తెచ్చారు.హెరిటేజ్ సంస్థకి సంబంధించి పలు కీలక పత్రాలతో సహా ఇతర కీలక డాక్యుమెంట్స్‌ను సిట్ సిబ్బంది తగలబెట్టింది. సిట్ అధిపతి కొల్లి రఘురామ్ రెడ్డి వ్యక్తిగత సిబ్బందే నేరుగా పత్రాలు తెచ్చి తగలబెట్టారని సిట్ సిబ్బంది
చెప్పారు.
సిట్ కార్యాలయం కాంపౌండ్‌లో హెరిటేజ్ సంస్థకు చెందిన కాగితాలు దహనం
Latest Articles
- Advertisement -


