కవితకు మధ్యంతర బెయిల్‌ నిరాకరించిన రౌస్‌ అవెన్యూ కోర్టు

ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురైంది. కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును వెలువరించింది. మధ్యంతర బెయిల్‌ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరిం చింది. తన చిన్న కుమారుడికి పరీక్షలు ఉన్నందున ఈ నెల 16 వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని రౌస్‌ అవెన్యూలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో కవిత పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఏప్రిల్ 4న తీర్పును రిజర్వ్ చేసింది. వాదనల సమయంలో కవిత మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌ను ఈడీ వ్యతిరేకించింది.

   ఆమెకు బెయిల్ ఇస్తే కేసు దర్యాప్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపింది. సాక్ష్యాలు, ఆధారాలను తారుమారు చేసే అవకాశం ఉందని పేర్కొంది. ఇప్పటికే అప్రూవర్‌గా మారిన కొందరిని ఆమె బెదిరిం చారని.. అందుకు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని వాదనల సందర్భంగా కోర్టు దృష్టికి తీసుకువ చ్చింది. మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను కొట్టివేయాలని ఈడీ కోరింది. ఈ నేపథ్యంలో మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌ను తోసిపుచ్చుతూ కోర్టు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు కవిత దాఖలు చేసిన రెగ్యులర్‌ బెయిల్ పిటిషన్‌పై సీబీఐ ప్రత్యేక కోర్టు ఈ నెల 20న విచారణ జరపనుంది. ఢిల్లీ లిక్కర్‌ కేసులో ఈడీ మార్చి 15న అరెస్ట్ అయిన కవిత, ప్రస్తుతం తీహార్‌ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్