రంగారెడ్డి జిల్లాలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. అడిగే నాథులు లేకపోవడంతో యథేచ్చగా మూడు పువ్వులు… ఆరుకాయలు అన్నట్టుగా ఇసుక దందా సాగిస్తున్నారు. షాబాద్ మండలం ఈసీ వాగులో ఇసుకను తోడేస్తూ అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం చూసిచూడనట్టు వ్యవహరిస్తుండటంపై అక్కడి ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికే వర్షాలు లేక భూగర్భ జలాలు అడుగంటి నీటి కొరతతో జనం అల్లాడుతుంటే,.. ఇలా ఇసుకను ఇష్టానుసారంగా తరలిస్తుంటే పట్టించుకోరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ఉన్నతాధికా రులు స్పందించి ఇసుకాసురులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.


