అవినీతి చేప
టౌన్ ప్లానింగ్ డిప్యూటీ డైరెక్టర్ జగన్‌మోహన్‌ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బిల్డింగ్ పర్మిషన్ కోసం జితేందర్ అనే వ్యక్తి నుంచి 50వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు అధికారులు. మసబ్ ట్యాంక్‌లో టౌన్ ప్లానింగ్ ఆఫీసులో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
సరిహద్దుల్లో హైఅలర్ట్
వరంగల్ తెలంగాణ ఛత్తీస్గడ్ సరిహద్దు ప్రాంతాల్లో భారీగా వాహనాలు తనిఖీలు చేస్తున్నారు అధికా రులు.. ఏజెన్సీలో ఏరియాలో పోలీసులు జల్లడబడుతున్నారు. ఛత్తీస్‌గఢ్ లో వరుస ఎన్‌కౌంటర్ల కు నిరసనగా… నేడు ఏజెన్సీ లో బంద్ కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. దీంతో తెలంగాణ సరిహద్దుల్లో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు.
సీఎంకు కృతజ్ఞతలు
సీఎం రేవంత్‌రెడ్డి నివాసంలో కొండారెడ్డిపల్లెకు చెందిన జవాన్ యాదయ్య కుటుంబ సభ్యులు కలిశారు. గతంలో దుండగుల కాల్పుల్లో మరణించిన జవాన్ యాదయ్య… కుటుంబానికి ఐదు ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించడంతో… సీఎం రేవంత్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
రుణపడి ఉంటా….
కాంగ్రెస్ పార్టీలో షర్మిలకు ఎప్పుడు రుణపడి ఉంటానని అన్నారు పలమనేరు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి శివశంకర్. నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గడిచిన పదేళ్లలో నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యమని అన్నారు.
అమ్మవారి సేవలో..
విజయవాడ కనకదుర్గమ్మను రఘురామకృష్ణంరాజు దర్శించుకున్నారు. వచ్చే ఎన్నికల్లో తప్పక పోటీ చేస్తానని ఆశాభావం వ్యక్తంచేశారు. తనకు టికెట్ వస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. మూడు, నాలుగు రోజుల్లో మంచి వార్త వస్తుందని ఆశిస్తున్నానని తెలిపారు.
శునకానికి పుట్టినరోజు వేడుకలు
పుట్టినరోజు వేడుకలు మనుషులకు చేస్తుంటాం. కానీ వీరు మాత్రం వైభవంగా శునకానికి వేడుకలు చేసి అందరినీ విస్మయపరిచారు. మహబూబాద్ జిల్లాలోని హస్తీనాపురం కాలనీలో దారా వెంకటేశ్వర్ల కుటుం బం గత కొద్దిరోజులుగా శునకాన్ని పెంచుకుంటున్నారు. స్మైలీకి బర్త్‌డే వేడుకలను ఘనంగా నిర్వహిం చారు.
కల్తీకల్లు
కామారెడ్డి జిల్లాలో అక్రమ కల్తీకల్లు ఏరులై పారుతుంది. అయినప్పటికీ అధికారులు నిమ్మకు నీరెత్తిన ట్లుగా వివరిస్తున్నారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కల్తీ కళ్ళు పై అధికారులు పలు కేసులు చేసినప్పటికీ కళ్ళు తయారీదారులు మాత్రం మారడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవా లని పలువురు కోరుతున్నారు.
డంప్ గుర్తింపు
ఒడిశా మల్కన్‌గిరి జిల్లాలో మావోయిస్టు భారీ డంప్‌ను గుర్తించారు. కలిమెల పీఎస్ పరిధిలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అడవుల్లో పోలీసు బలగాలు జల్లెడ పడుతున్న సమయంలో మావోయిస్టుల డంప్ గుర్తించారు. ఈ డంప్‌లో ఐఈడీలు, పేలుడు పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.


