భారతదేశ బ్యాంకింగ్ వ్యవస్థ సుస్థిరతకు నిలువెత్తు సాక్ష్యం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. రిజర్వ్ బ్యాంక్ 90వ వ్యవస్థాపక దినోత్సవంలో ప్రధాని పాల్గొన్నారు. 2014లో ఆర్బీఐ 80 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగిన కార్యక్రమానికి తాను హాజరైనప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా ఉండేదని ప్రధాని అభిప్రాయ పడ్డారు. భారతదేశంలోని మొత్తం బ్యాంకింగ్ రంగం సమస్యలు, సవాళ్లతో సతమతమవుతోందన్నారు. భారత బ్యాంకింగ్ వ్యవస్థ స్థిరత్వం, భవిష్యత్తు పై గతంలో సందేహాలున్నాయి. దేశ ఆర్థిక పురోగతికి ప్రభుత్వ రంగ బ్యాంకులు తగినంత ప్రోత్సాహం ఇవ్వలే నంత దారుణంగా పరిస్థితి ఉండేదని.. నేడు, భారతదేశ బ్యాంకింగ్ వ్యవస్థ ఒక బలమైన మరియు సుస్థిరమైన బ్యాంకింగ్ వ్యవస్థగా దర్శనం ఇస్తోందన్నారు. ఎలక్టోరల్ బాండ్ ఇష్యూ వల్ల తమ ప్రభుత్వాని కి ఎదురుదెబ్బ తగిలిందన్న వాదనను ప్రధాని తోసిపుచ్చారు.ఏ వ్యవస్థ కూడా పరిపూర్ణంగా లేదని, ఏదైనా లోపం ఉంటే.. సరిదిద్దుకోవచ్చని అన్నారు.


