తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. పగలు వేడి తీవ్రత అత్యంత ఎక్కువగా ఉంటుంది. వారం రోజులుగా పగలు ఎండ, రాత్రి వేడిగాలులతో పాటు ఉక్కపోతతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతు న్నారు. దీంతో ప్రజలు ప్రయాణాలు చేయాలంటే భయపడిపోతున్నారు. మరోవైపు జంతువులు, పక్షులు నీడ కోసం, నీటి కోసం అల్లాడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ ఆటో డ్రైవర్ వినూత్నంగా ఆలోచించాడు. ఆటోపై మొక్కలను పెంచాడు.
ఓ వైపు మండుటెండలు.. మరోవైపు ఉచిత బస్సు ప్రయాణం. ఈ రెండిటినీ ధీటుగా ఎదుర్కొనేందుకు ఓ ఆటో డ్రైవర్ కొత్తగా ఆలోచించాడు. మహబూబాబాద్ జిల్లా ఈదులపూసపల్లి గ్రామానికి చెందిన అంజి 15 సంవత్సరాలుగా ఆటో నడుపుతున్నాడు. అతను.. ప్రజలకు ఎండవేడి నుండి ఉపశమనం కలిగించేం దుకు కొత్త కొత్త ప్రయత్నాలు చేశాడు. ప్రయాణికులను ఆకట్టుకోవడానికి, వారికి చల్లదనాన్ని అందించడా నికి ఆటోపై మొక్కలను పెంచడమే కాకుండా పక్షులను కూడా ఎండ వేడి నుండి కాపాడుతున్నాడు. ఆటోలో బ్యాటరీ ఫ్యాన్లు అమర్చి చల్లని గాలినందిస్తున్నాడు. ప్రజలను ఎండ వేడి నుంచి కాపాడాలనే అంజి ఆలోచనను అందరూ అభినందిస్తున్నారు. అంజి ఆటో ఎక్కడానికి ప్రయాణికులు ఆసక్తి చూపిస్తు న్నారు.