రోజురోజుకూ సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. సులువుగా డబ్బులు సంపాదించేందుకు కొందరు కేటుగాళ్లు సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా ఏప్రిల్ 5న జరగనున్న IPL మ్యాచ్‌కు టికెట్లు ఇస్తామంటూ సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడ్డారు. ఇప్పటికే చెన్నై, హైదరాబాద్ మ్యాచ్‌కు టికెట్లన్నీ అమ్ముడుబోయాయి. ఇదే అదనుగా సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియా వేదికగా టికెట్లు ఆన్‌లైన్‌లో అమ్ముతున్నా మంటూ QR కోడ్ పంపి డబ్బులు గుంజుతున్నారు. టికెట్లపై డిస్కౌంట్ సైతం ఇస్తామంటూ సైబర్ ముఠా మోసం చేస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.


