వరంగల్ రాజకీయాలు క్షణానికో మలుపుతిరుగుతోంది. స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మళ్లీ గులాబీ పార్టీ వైపు చూస్తున్నారు. గత ఎన్నికల్లో రాజయ్యకు టికెట్ ఇవ్వకపోవడంతో మనస్థా పానికి గురైన ఆయన కాంగ్రెస్‌లో చేరారు. ఇప్పుడు కడియం కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమ వ్వడంతో తాటికొండ మళ్లీ కారెక్కేందుకు సిద్ధమవుతున్నారు. కడియం శ్రీహరితోపాటు బీఆర్‌ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్యకూడా కాంగ్రెస్ గూటికి చేరడంతో ఇప్పుడు గులాబీ పార్టీ తరుపున రాజయ్య ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. కాగా హైదరాబాద్ లో రాజయ్య ఇంటికి వెళ్లిన బీఆర్‌ఎస్ నేతలు ఆయనను పార్టీలో చేరాలని కోరనున్నారు. రాజయ్య కేసీఆర్‌తో కూడా భేటీ కానున్నట్లు తెలుస్తోంది.