29.2 C
Hyderabad
Sunday, November 3, 2024
spot_img

స్వతంత్ర సంక్షిప్త వార్తలు

గెలుపుపై ధీమా

ఎల్బీ నగర్ నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో బీజేపీ ఎంపీ అభ్యర్ధి ఈటెల రాజేందర్‌ పాల్గొన్నారు. నాగోల్‌లో జరిగిన ఈ సమావేశంకు మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు, రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు సామ రంగారెడ్డితో పాటు పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పనితనమే తనకు స్ఫూర్తి అన్న ఈటెల, పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తోందని ధీమా వ్యక్తం చేసారు.

బాబు వస్తేనే భవిష్యత్

కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కానూరు గ్రామంలో నారా భువనేశ్వరి పర్యటించారు. చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక మృతిచెందిన పార్టీ కార్యకర్త వేమూరి పార్ధసారధి కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబసభ్యుల్ని ఓదార్చారు. బాబు వస్తేనే భవిష్యత్తు అన్న భువనేశ్వరి వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేసారు.

ధైర్యం నింపే ప్రయత్నం

పార్లమెంటు ఎన్నికల వేళ పార్టీలోని కీలక నేతలు ఒక్కొక్కరు బైటకి వస్తున్న క్రమంలో క్షేత్రస్ధాయి నాయకులు, కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేసారు కెటీఆర్‌. సోషల్‌ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్నే సాధించిన ధీశాలి కెసీఆర్‌ అన్న ఆయన…. నికార్సైన కొత్త తరం నాయకత్వం తయారుచేస్తాం, పోరాట పంథాలో కదం తొక్కుదాం అంటూ నేతలు, కార్యకర్తల్లో జోష్‌ను నింపే ప్రయత్నం చేసారు.

వేతనాలు పెంపు

ఎన్నికల వేళ ఉపాధి హామీ కూలీలకు శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం. ఉపాధి హామీ కూలీలకు సగటున 4 నుంచి 10 శాతం మేర వేతనాలను పెంచింది. ఎన్నికల సంఘం నుంచి క్లియరెన్స్‌ వచ్చాకే… వేతన సవరణ వివరాలను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నోటిఫై చేసింది. హర్యానాలో అత్యధికంగా రోజుకు 374 రూపాయలు చొప్పున వేతనం అందనుండగా, అరుణాచల్‌ ప్రదేశ్‌, నాగాలాండ్‌ల్లో అత్యల్పంగా రోజుకు 234 రూపాయలు అందనుంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణాల్లో దినసరి వేతనం 28 రూపాయలు పెరిగి 300 రూపాయలకు చేరింది.

అధ్యక్షులుగా రవీందర్‌రెడ్డి

తెలంగాణ హైకోర్ట్‌ బార్‌ అసోసియేషన్‌ ఎన్నికలు ముగిసాయి. నూతన కార్యవర్గం ఏర్పాటైంది. అధ్యక్షులుగా ఏ. రవీందర్‌రెడ్డి ఎన్నికయ్యారు. ఏడాది కాలం పాటు నూతన కమిటీ బాధ్యతలు నిర్వర్తించనుంది. తొలిసారిగా ఓ మహిళా అడ్వకేట్‌ అసోసియేషన్‌కు ఉపాధ్యక్షురాలిగా ఎంపికైంది. ఆ ఘనత ఏ. దీప్తి అనే మహిళకు దక్కింది.

కోడ్‌ ఉల్లంఘన

పల్నాడు జిల్లా నరసరావుపేట వైసీపీ నేతలు ఎన్నికల కోడ్‌ను తుంగలో తొక్కారు. ఇసప్ప పాలెంలో ఆ పార్టీ వర్గీ యులు అమ్మవారి తిరునాళ్ళలో విద్యుత్ ప్రభ కట్టి, వైసీపీ పాటలకు డాన్సులు వేయించి హోరెత్తించారు. టీడీపీ నేతల ప్రభలకు అడ్డుచెప్పిన అధికారులు వైసీపీ ఇలా ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనలు పాల్పడినా ఎందుకు పట్టించుకోరని ఆగ్రహం వ్యక్తం చేసారు.

గుడ్ ఫ్రైడే ర్యాలీ

గుడ్ ఫ్రైడే పురస్కరించుకొని హైదరాబాద్‌ సనత్‌నగర్‌ క్రిస్టియన్‌ యూత్‌ ఆధ్వర్యంలో క్రాస్ ర్యాలీ నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలో సనత్ నగర్ డివిజన్ లోని మెథడిస్ట్, బాప్టిస్ట్, సిఎస్ఐ చర్చ్ సభ్యులతోపాటు ఇండి పెండెంట్ యునైటెడ్ సెర్చ్, బెతేల్ ప్రేయర్ హౌస్ సంఘ సభ్యులు, క్రైస్తవులు పెద్ద సంఖ్యలో పాల్గొ న్నారు.

ప్రేమ – రాజకీయం

రాజకీయకక్షతో తమ కుమార్తెను ప్రేమ ముసుగులో టార్గెట్‌ చేసారంటూ యువతి కుటుంబసభ్యులు ఆందోళన చేసారు. స్టేషన్‌ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలు పోలీసుస్టేషన్‌ వద్ద జరిగిన ఈ ఘటన ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. తమ కుమార్తెను రాజకీయ ప్వప్రయోజనాలకు అధికార వైసీపీ పార్టీ వాడుకుంటోందని ఆరోపించారు అమ్మాయి కుటుంబసభ్యులు.

వ్యక్తి దారుణ హత్య

అన్నమయ్య జిల్లా రాయచోటి ఫాతీమా మసీదులో ఇంతియాజ్‌ అలీఖాన్‌ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ప్రార్థనల్లో ఉన్న ఇంతియాజ్‌పై తోడళ్లుడు కత్తితో దాడి చేసి ఈ హత్యకు ఒడిగట్టాడు. అడ్డుకునే ప్రయత్నం చేసిన వార్ని భయభ్రాంతులకు గురిచేసాడు. పోలీసులు మృతదేహాన్ని రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించి విచారణ చేస్తున్నారు.

అగ్ని ప్రమాదం

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లోని స్క్రాప్ దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు భారీగా ఎగసి పడ్డాయి. పక్కనే సిలిండర్‌ గోదాం ఉండటంతో పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్నిఅదుపుచేసారు.

పుస్తెల తాడు చోరీ

యాదాద్రి నల్గొండ జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీలో దొంగలు హల్‌చల్ చేసారు. ఇందిరానగర్ లో ఆరు బయట నిద్రిస్తున్న గడ్డం. యాదమ్మ అనే 51 ఏళ్ల మహిళ మెడలోంచి మూడు తులాల బంగారు పుస్తెల తాడును దొంగిలించి పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేస్తున్నారు.

ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ అదిరే…

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ మూవీ తలైవర్‌ 171 చిత్రానికి సంబంధించి ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ అయ్యింది. స్టార్‌ డైరెక్టర్‌ లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో లైకాప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న ఈ మూవీ నుంచి ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ ను రిలీజ్‌ చేసాడు తమిళ స్టార్‌ హీరో ధనుష్‌. ఈ పోస్టర్‌లో రజనీకాంత్‌ బంగారు వాచీలతో చెయ్యబడిన సంకేళ్లతో దర్శనమిస్తూ…నవ్వుతూ కనిపించారు. ఈ ఫస్ట్‌ లుక్‌ చిత్రంపై హైప్‌ను మరింత పెంచింది.

టాప్‌ త్రీ రెస్టారెంట్స్‌

ఆసియాలోని 50 అత్యుత్తమ రెస్టారెంట్‌ల జాబితాలో భారతదేశంలోని 3 ప్రముఖ రెస్టారెంట్‌లు తమ స్ధానాన్ని దక్కించుకున్నాయి. ముంబయిలోని రెస్టారెంట్ మాస్క్‌ ఈ జాబితాలో 23వ స్ధానంలో నిలవగా, ఢిల్లీకి చెందిన ఇండి యన్‌ యాక్సెంట్‌ 26వ స్ధానంను పొందింది . చెన్నైకి చెందిన అవర్తనా 44వ స్ధానంలో నిలిచి అత్యంత ప్రతిష్టా త్మకమైన న్యూ ఎంట్రీ అవార్డును కూడా అందుకుంది. ఇక తొలి మూడు స్ధానాల్లో టోక్యో, బ్యాంకాక్‌, థాయ్‌లాండ్‌ దేశాల్లోని సెజాన్‌, ఫ్లోరిలేజ్‌, గగ్గన్‌ ఆనంద్‌ లు ఉన్నాయి.

షాకింగ్‌ న్యూస్‌

యంగ్‌ ఇండియాగా పేరొందిన భారత్‌లో క్రమేణా యువ జనాభా తగ్గిపోతోందనే వార్త ఆందోళన కలిగిస్తోంది. దేశ అభి వృద్ధిలో కీలకమైన యంగ్‌ పాపులేషన్‌ దక్షిణాది రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో భారీగా తగ్గనుంది. ILO – ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యూమన్‌ డెవలప్‌మెంట్‌తో కలసి భారత ఉపాధి నివేదిక – 2024 తాజాగా ఈ విషయాన్ని వెల్లడించింది. 2039 నాటికి తెలంగాణలో 15-29 ఏళ్ల యువ జనాభా తగ్గనుందని కూడా తేల్చింది.

అతి పెద్ద అనకొండ మృతి

ఇటీవల అమెజాన్‌ అడవుల్లో కనుగొన్న ప్రపంచంలోనే అతి పెద్ద అనకొండ చనిపోయింది. ప్రొఫెసర్‌ ఫ్రీక్‌ వోంక్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో దీని మరణవార్తను షేర్‌ చేసారు. దీని మృతికి గల కారణాలను పరిశోధకులు అన్వేషిస్తున్నారు. అనాజూలియాగా పిలవబడే ఈ అనకొండ 26 అడుగుల పొడవు, 440 పౌండ్ల కంటే ఎక్కువ బరువు కలిగి ఉంది. జీవశాస్త్రవేత్తలు దీని DNAని నిశితంగా విశ్లేషించగా, ఇతర అనకొండలతో పోలిస్తే 5.5 శాతం వ్యత్యాసాన్ని కలిగి ఉంది.

ఫైనల్స్‌లోకి బోపన్న జోడీ

భారత టెన్నిస్‌ డబుల్స్‌ స్టార్‌ రోహన్‌ బోపన్న మియామి ఒపెన్‌లో ఫైనల్స్‌ లోకి దూసుకెళ్లాడు. సెమీస్‌లో బోపన్న-ఎబ్డెన్‌ ల జోడీ గ్రానోలర్స్‌, జెబల్లాస్‌ పై 6-1, 6-4 తేడాతో విజయం సాదించి ఫైనల్స్‌లోకి ప్రవేశించింది. నాలుగుపదుల వయస్సులోనూ చక్కటి ఆటతీరును ప్రదర్శిస్తున్న భారత్‌ డబుల్స్‌ స్టార్‌ బోపన్నపై పలువురు ప్రశంసలు కురిపిస్తు న్నారు.

 

Latest Articles

‘ధూం ధాం’ ట్రైలర్ లాంచ్ చేసిన అనిల్ రావిపూడి

చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "ధూం ధాం". సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫ్రైడే...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్