ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన దానం నాగేందర్ పై పలు విమర్శలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అధికారం కోసం ఆశపడి పార్టీ మారారని చెప్పారు. మంచి రోజులు ఉన్నప్పుడు ఎవరైనా వస్తారని.. కష్టకాలంలో నిలబడ్డ నాయకుడే నిజమైన నేత అని అన్నారు. పదవుల కోసం ఆశపడి పార్టీ మారే వారికి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు కేటీఆర్. తెలంగాణ భవన్‌లో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతల సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి కేటీ ఆర్, సికింద్రాబాద్ లోక్‌సభ అభ్యర్థి పద్మారావ్ గౌడ్, పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు హాజరయ్యారు. లోక్ సభ ఎన్నికలపై నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రచార వ్యూహంపై చర్చిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. సికింద్రాబాద్ లోక్ సభ గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ వ్యూహ రచన చేస్తోంది.


