పౌరసత్వ సవరణ చట్టంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఘాటుగా విమర్శించారు. దేశవ్యాప్తంగా ప్రజలు పౌరసత్వ సవరణ చట్టాన్ని ఉపసం హరించుకోవాలని కోరుకుంటున్నారు అని కేజ్రీవాల్ అన్నారు. బంగ్లాదేశ్, పాకిస్థాన్, ఆఫ్గానిస్తాన్ నుంచి వచ్చే మైనారిటీలకు భారత పౌరసత్వం ఇస్తామని కేంద్రం చెబుతోందని తెలిపారు. ఆయా దేశాల నుంచి భారీ సంఖ్యలో మన దగ్గర మైనారిటీలను తీసుకువస్తారని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం భారత యువతకు ఉద్యోగావకాశాలు కల్పించదని, పాకిస్థాన్ నుంచి వచ్చేవారి పిల్లలకు ఉద్యోగాలు ఇస్తుందని కేజ్రీవాల్ విమర్శించారు.