17.2 C
Hyderabad
Monday, January 19, 2026
spot_img

పథకాలనే నమ్ముకున్న వైసీపీ

      మీ ఇంట్లో వైసీపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ ఫలాలు అందాయంటేనే మాకు ఓటు వేయండి..! ఇదేదో .. ఇద్దరు ముగ్గురు మధ్య చెప్పిన మాట కాదు.. అన్నది కూడా అలాంటి ఇలాంటి వ్యక్తి కాదు. వేలాది మంది సమక్షంలో …అది కూడా భారీ బహిరంగ సభల్లో .. ఏపీ సీఎం జగన్ స్వయంగా చెప్పిన మాటలివి. గత నాలుగున్నరేళ్ల పాలనలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఏదో ఓ పథకం రూపంలో సర్కారు సాయం అందిందని.. అదే తమను మరోసారి గట్టెక్కిస్తుందని భావిస్తు న్నారు ముఖ్యమంత్రి. మరి.. ముఖ్యమంత్రి అనుకున్నట్లుగా ఏపీలో మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తుందా ? అభ్యర్థు ల మార్పు అనే వ్యూహం ఏ మేరకు పార్టీ విజయావకాశాలపై ప్రభావం చూపుతుంది ?

     వైనాట్ 175..! ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల వేళ అధికార పార్టీ గట్టిగా విన్పిస్తున్న నినాదం ఇదే. 2019 ఎన్నికల్లో సాధించిన గెలుపును మించేలా.. ఇంకా చెప్పాలంటే ఏపీ అంతటా క్లీన్ స్వీప్ చేయడమే టార్గెట్‌గా పెట్టు కుంది వైసీపీ. ఇందులో భాగంగా రెండేళ్ల ముందు నుంచే వ్యూహాత్మకంగా పావులు కదపడం ప్రారంభించారు వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్.

     ప్రభుత్వం తరఫున అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు ఎలా అందుతున్నాయి.. వారిలో పార్టీ పట్ల, ప్రభు త్వం పట్ల ఏ విధమైన అభిప్రాయం వ్యక్తమవుతోంది అన్న అంశాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ఇక, నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది అన్న అంశాలను ఎప్పటికప్పుడు సర్వేల ద్వారా తెప్పించు కుంటున్న ముఖ్యమంత్రి.. ఇంకా ఏం చేయాలి.. ఎలా ముందుకెళ్లాలి అన్న అంశంపై పలుమార్లు దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలోనే పనితీరు బాగాలేని వారిని సరిదిద్దుకోవాలని సూచించారు. మాట వినకపోతే వేటు తప్పదని హెచ్చరిం చారు. వైనాట్ 175 లక్ష్యం దిశగా ముందుకెళుతున్న అధినేత జగన్.. హెచ్చరికలు చేసి ఊరుకోలేదు. సర్వే రిపోర్టులు వ్యతిరేకంగా వచ్చిన ఎమ్మెల్యేలను, ఎంపీలను నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టారు. ఈ క్రమంలో కొందరికి సీటు నిరాకరిం చారు. మరికొందరికి స్థాన చలనం కలిగించారు. ఇంకొందర్ని ఎంపీ స్థానాలకు పోటీ చేయాలని సూచించారు. అయితే. . సీఎం ఆదేశాలు నచ్చని పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీ నుంచి బయటకు వెళ్లారు. అయినా.. డోంట్ కేర్
అన్నట్లుగానే ముందుకు సాగుతున్నారు సీఎం జగన్.

   అభ్యర్థుల మార్పులు చేర్పుల ప్రక్రియ దాదాపుగా పూర్తి చేసిన జగన్.. సిద్ధం అంటూ ప్రజల్లోకి వచ్చేశారు. పార్టీ శ్రేణుల్ని ఎన్నికలకు సమాయాత్తం చేయడంతోపాటు ప్రజల కోసం ప్రభుత్వం తరఫున చేపడుతున్న కార్యక్రమాలను వివరిస్తు న్నారు. మీ ఇంట్లో ప్రభుత్వం ద్వారా మంచి జరిగిందని భావిస్తేనే ఓటు వేయండి అంటూ వేలాది మంది సమక్షంలో ధైర్యంగా ప్రకటిస్తున్నారు. ఏ సభలో చూసినా ఇదే పరిస్థితి. తద్వారా తాను నమ్ముకున్న పథకాలు ప్రజలకు చేరాయని.. అవే మళ్లీ తమను గెలిపిస్తాయనే భరోసా పార్టీ కేడర్‌లో నింపుతున్నారు. ప్రజల్లోనూ తన విశ్వసనీయత అంతకంతకూ పెంచుకుంటున్నారు ఏపీ సీఎం జగన్. అటు విపక్షాలపైనా తనదైన శైలిలో పంచులు,సెటైర్లు వేస్తూ కోలుకోలేని దెబ్బ కొడుతున్నారు సీఎం జగన్. ఒక్కడ్ని ఓడించేందుకు అందరూ ఏకమవుతున్నారని ఎద్దేవా చేస్తున్నారు. చంద్రబాబు పేరు చెబితే ఇన్నేళ్లలో చేసిన ఒక్క మంచి సైతం గుర్తుకు వచ్చే పరిస్థితి లేదంటూ సెటైర్లు వేస్తున్నారు. అటు.. దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థకే కళంకమంటూ పదునైన విమర్శలు చేస్తూ ప్రత్యర్థుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు వైసీపీ అదినేత.

    ఇవన్నీ ఒక ఎత్తైతే మరోసారి అధికారంలోకి వచ్చేందుకు తిరుగులేని ఆయుధంలా ఉపయోగపడేలా. .మేనిఫెస్టో ప్రకటించేందుకు సిద్ధమయ్యారు జగన్. ఈనెల 10న మేదరమెట్ల సభ ద్వారా పలు ప్రజాకర్షక హామీలను ఏపీ ప్రజల ముందు ఉంచబోతున్నారు. ఇప్పటికే ఉన్న అమ్మ ఒడి, ఆరోగ్య శ్రీ సహా, ఫించన్ల పెంపు, రైతు రుణమాఫీ, డ్వాక్రా మహిళలపై వరాల జల్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే మరిన్ని కొత్త హామీల ను ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. మరి.. ఇప్పటికే అమలు చేస్తున్న హామీలు.. త్వరలో ప్రకటించ బోయే నూతన సంక్షేమ పథకాలు వైసీపీ గెలుపునకు ఏ స్థాయిలో ఉపయోగపడతాయి..అన్న దానిపైనే ఆసక్తికర చర్చ జరుగుతోంది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్