భారతదేశపు సిలికాన్ వ్యాలీ గా పేరొందిన బెంగళూరులో వేసవి ప్రారంభానికి ముందు అత్యంత దారుణమైన నీటి సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. బెంగళూరు ప్రజలు నీటి కటకట ఎదుర్కొంటున్నారు. మంచినీటి కష్టాలు మొదల య్యాయి. బెంగళూరు బృహత్ మున్సిపల్ కార్పొరేషన్ సరఫరా చేస్తున్న నీరు సరిపోవడంలేదు చుక్కచుక్కకూ ఇబ్బంది పడుతున్నారు. బెంగళూరు శివారులోని వైట్ ఫీల్డ్, యల హంక, కనకపుర ప్రాంతంలో నీటి ఎద్దడి చాలా తీవ్రంగా ఉంది.
బెంగళూరు నగరంలో హౌసింగ్ సొసైటీల్లో నీటి కటకట మరీ తీవ్రంగా ఉంది.బెంగళూరులోని గేటెడ్ సొసైటీలకు కూడా నీటి ఎద్దడి వ్యాపించింది. ఓ హౌసింగ్ సొసైటీ అయితే నీరు వృధా చేసిన గృహస్తు లకు 5వేల రూపాయల జరిమానా విధించింది. దగ్గర ఉండి అన్ని కుటుంబాలకు మంచినీరు క్రమంగా అందేలా చూసేందుకు సెక్యూరిటీ గార్డును నియమించింది. కొన్ని వారాల క్రితం ప్రైవేటు ట్యాంకర్ల నుంచి రూ.500 ఉన్న టాంకర్ నీరు.. ఇప్పుడు పెరిగిపోయింది. ఇప్పుడు 12 వేల లీటర్ల ట్యాంకర్ కు దాదాపు 800 రూపాయలనుంచి రెండు వేలవరకూ వసూలు చేస్తున్నారు.
కొన్నేళ్ల క్రితం ఐటీ రాజధానిలో కురిసిన భారీ వర్షాలకు నగరంలో విల్లాలు, అపార్ట్ మెంట్ లు నీటమునిగాయి. కాగా, ప్రస్తుతం నీటి కొరత తాగడానికి చుక్క నీరు లేదనే పరిస్థితి నెలకొంది. ఇప్పుడు వాటర్ ట్యాంకర్లే చాలా ప్రాంతాల్లో ప్రజల దాహాన్ని తీరుస్తున్నాయి.మహదేవపురా ప్రాంతంలో హుడీ రోడ్ టెక్ కారిడార్ ప్రాంతంలో తండ్రీ కూతురు రోడ్డు పక్క లీకేజ్ అవుతున్న పైప్ ల నుంచి నీటిని చుక్కచుక్కా ఒడిసి పట్టుకుని సేకరించుకుంటుంటే.. మరికొందరు వాటర్ ట్యాంక్ లకోసం డిమాండ్ చేస్తున్నారు. పెరిగిపోతున్న పట్టణీ కరణ, జోరుగా సాగుతున్న నిర్మాణ కార్యకలాపాలు, అడుగడుగునా తవ్వుతున్న బోర్లు, ఎండిపోతున్న చెరువులు, పడిపోతున్న భూగర్భ జలాలు, పట్టణంలో చెరువులు, కాల్వలలో పెరుగుతున్న కాలుష్యం, ఇలా నీటి కాలుష్యానికి కారణాలెన్నో..గత సంవత్సరం నీటి సంక్షోభం తలెత్తిన ప్పుడు ఖచ్చితంగా, ట్యాంకర్లు వచ్చాయి, కానీ అది మే నెలలో జరిగింది. ఈ సంవత్సరం ఇంకా మార్చి ప్రారంభంలోనే ఉన్నాం. గత సంవత్సరం రుతుపవనాల పుణ్యమా అని 1000 మి.మీ వర్షం వచ్చింది. కానీ నీటి సంక్షోభం ఇప్పుడు తీవ్రంగా ఉందని బెంగళూరు వాసులు వాపోతున్నారు.