ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్ అమీర్‌పేట్‌లో గృహజ్యోతి పథకాన్ని ఆయన ప్రారంభించారు. మీటర్ రీడింగ్‌ను తీసి స్వయంగా జీరో బిల్లులను మహిళలకు అందజేసి మాట్లాడారు. ఒక్కో ఇంటికి వెయ్యి రూపాయల విలువైన విద్యుత్‌ను ఉచితంగా ఇస్తున్నట్లు తెలిపారు. నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలని.. అనవసరమైన విమర్శలొద్దని ప్రతిపక్షాలకు సూచించారు. ఈ నెల 11న ఇందిరమ్మ ఇళ్లతో పాటు మిగతా వాగ్దానాలను పూర్తి చేస్తానమి మంత్రి స్పష్టం చేశారు. పేదలను ఆదుకుంటూ ఇచ్చిన మాట నిలబెట్టుకొని పథకాలను అమలు చేస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందని మంత్రి పొన్నం అన్నారు.


